Nehal Wadhera: వామ్మో.. అయినా అదేం సిక్స్ కొట్టడం బాబోయ్.. మనోడి బాదుడికి బంతి ఎక్కడ పడిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-04-03T11:39:49+05:30 IST
ఐపీఎల్ (IPL 2023) అంటేనే ఫోర్లు, సిక్స్‌ల పండగ. బ్యాట్‌తో బ్యాట్స్‌మెన్ చేసుకునే వేడుక. క్రికెట్ అభిమానులకు హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించే వేదిక.
ఐపీఎల్ (IPL 2023) అంటేనే ఫోర్లు, సిక్స్‌ల పండగ. బ్యాట్‌తో బ్యాట్స్‌మెన్ చేసుకునే వేడుక. క్రికెట్ అభిమానులకు హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించే వేదిక. తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాట్స్‌మెన్ నేహల్ వాదేర (Nehal Wadhera) కొట్టిన భారీ సిక్స్ ఏకంగా స్టేడియం టాప్‌పైన పడింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.
ఇన్నింగ్స్ 14వ ఓవర్లో స్పిన్నర్ కర్ణ శర్మ వేసిన నాలుగో బంతిని నేహల్ లాగి పెట్టి కొట్టాడు. అది ఏకంగా 101 మీటర్ల అవతల పడింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న ముంబైకి ఆ సిక్స్ (101m Six) కాస్త రిలీఫ్ కలిగించింది. మంచి టచ్‌లో కనిపించిన నేహల్ (21) కొద్దిసేపటికే అవుటై పెవిలియన్ చేరాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది.
RCBvsMI: చూసుకోవాలి కద బ్రో.. ఇద్దరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది.. ఇంతకీ అది ఎవరు పట్టుకోవాల్సిన క్యాచ్ అంటారు మాస్టారూ..!
తిలక్ వర్మ (84 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 నాటౌట్), ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` డుప్లెసి (43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73) రాణించడంతో ముంబైపై బెంగళూరు సునాయాసంగా నెగ్గింది.