Trent Boult: ట్రెంట్ బౌల్ట్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2023-05-20T10:08:47+05:30 IST
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే బౌల్ట్ ప్రారంభ ఓవర్లోనే వికెట్ తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
రాజస్థాన్ రాయల్స్ (RR) బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult ) ఆరంభంలోనే వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే బౌల్ట్ ప్రారంభ ఓవర్లోనే వికెట్ తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ (RRvsPBKS) జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్ రెండో బంతికే బౌల్ట్ వికెట్ తీశాడు. అయితే ఈ అవుట్ వెనుక బౌల్ట్ బౌలింగ్ నైపుణ్యంతో పాటు ఫీల్డింగ్ ప్రతిభ కూడా ఉంది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికి బౌల్ట్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని ఓపెనర్ ప్రభు సిమ్రాన్ (Prabhsimran Singh) తప్పుగా అంచనా వేశాడు. బంతి బ్యాట్‌కు తగిలి బౌలర్‌కు కాస్త ఎడంగా వెళ్లింది. బౌల్ట్ వెంటనే రియాక్ట్ అయి తన కుడి వైపునకు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ (Super Catch) అందుకున్నాడు. అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డైవింగ్ క్యాచ్‌ను అందుకోవడం అంత సులభం కాదు. బౌల్ట్ మంచి ఫీల్డర్ కూడా కావడంతో పంజాబ్‌కు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. బౌల్ట్ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Yashasvi Jaiswal: ఐపీఎల్ చరిత్రలో పంత్ తర్వాత ఆ రికార్డు జైస్వాల్‌దే.. కోహ్లీ కూడా తర్వాతి స్థానంలోనే..
ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్ సమష్టిగా పోరాడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగి 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పడిక్కల్ (51), జైస్వాల్ (50), హెట్‌మేయర్ (46) రాణించారు.