Rahmanullah Gurbaz: డీఆర్‌ఎస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా? రహ్మనుల్లాపై అభిమానుల ఫైర్!

ABN , First Publish Date - 2023-05-09T10:50:24+05:30 IST

క్రికెట్ అనేది ఓ టీమ్ స్పోర్ట్. ఈ ఆటలో వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడానికే అందరూ ప్రయత్నిస్తారు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రహ్మనుల్లా గుర్భాజ్ తీసుకున్న ఓ నిర్ణయం విమర్శల పాలవుతోంది.

Rahmanullah Gurbaz: డీఆర్‌ఎస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా? రహ్మనుల్లాపై అభిమానుల ఫైర్!

క్రికెట్ అనేది ఓ టీమ్ స్పోర్ట్. ఈ ఆటలో వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడానికే అందరూ ప్రయత్నిస్తారు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో (KKRvsPBKS) కోల్‌కతా బ్యాటర్ రహ్మనుల్లా గుర్భాజ్ (Rahmanullah Gurbaz) తీసుకున్న ఓ నిర్ణయం విమర్శల పాలవుతోంది. ``అవుట్`` అని అవతల బ్యాటర్ చెబుతున్నా సరే వినకుండా డీఆర్‌ఎస్‌కు (DRS) వెళ్లిన గుర్భాజ్ జట్టుకు నష్టాన్ని చేకూర్చాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓపెనర్లు తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్లో నాథన్ ఎలిస్ (Nathan Ellis ) వేసిన నాలుగో బంతిని గుర్భాజ్ లెగ్ సైడ్ వైపు ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ను మిస్ అయి ప్యాడ్లను తాకింది. దీంతో బౌలర్ ఎల్బీడబ్ల్యూ (LBW) కోసం అప్పీలు చేశాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అయితే ఆ నిర్ణయంతో గుర్భాజ్ అసహనానికి గురయ్యాడు.

Andre Russell: మరోసారి చెలరేగిన రస్సెల్, రింకూ.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను ఎలా గెలిపించారంటే..

నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జేసన్ రాయ్‌తో (Jason Roy) సంప్రదించాడు. బంతి వికెట్ల లైన్‌లోనే పడిందని జేసన్ రాయ్ సైగలు చేశాడు. అయినా గుర్భాజ్ డీఆర్‌ఎస్ కోరాడు. దీంతో రాయ్ అసహనానికి గురయ్యాడు. రీప్లేలో గుర్భాజ్ అవుట్ అని తేలింది. అవుట్ అని తెలిసినా వ్యక్తిగత స్వార్థం కోసం డీఆర్‌ఎస్ కోరి, ఒకటి వేస్ట్ చేసిన గుర్భాజ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ (Trolling) మొదలైంది. గుర్భాజ్ సెల్ఫిష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-09T10:50:24+05:30 IST