KL Rahul: బీసీసీఐ ఆధ్వర్యంలో కేఎల్ రాహుల్‌ చికిత్స.. తర్వాతి మ్యాచ్‌ల్లో లఖ్‌నవూ సారథి ఎవరంటే..

ABN , First Publish Date - 2023-05-03T12:27:09+05:30 IST

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. అతడి మోకాలికి తీవ్ర గాయమైంది.

KL Rahul: బీసీసీఐ ఆధ్వర్యంలో కేఎల్ రాహుల్‌ చికిత్స.. తర్వాతి మ్యాచ్‌ల్లో లఖ్‌నవూ సారథి ఎవరంటే..

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో (RSB) జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ (KL Rahul Injury) గాయపడ్డాడు. అతడి మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో చివరి బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు. గాయం కాస్త పెద్దది కావడంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్‌తో (IPL 2023)పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

రాహుల్ ఇప్పటికీ మోకాలి వాపు, తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత గురించి తెలుసుకోవడానికి ఈ రోజు (బుధవారం) అతడికి ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించనున్నారు. స్కానింగ్ రిపోర్టులు రావాల్సి ఉండటంతో రాహుల్ ఇప్పటికీ లఖ్‌నవూలో మెడికల్ టీమ్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. రిపోర్టులు వచ్చాక అతడు బెంగళూరు (Bengaluru) బయల్దేరి వెళ్లనున్నాడు. రాహుల్ టీమిండియా కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతడి బాధ్యతను బీసీసీఐ (BCCI), బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) తీసుకున్నాయి. ఈ వారమే రాహుల్ ఎన్‌సీఏ (NCA)లో రిపోర్ట్ చేయనున్నాడు.

Ishant Sharma: ఢిల్లీని గెలిపించిన ఇషాంత్ శర్మ.. అనుభవం ముందు ఓడిన రాహుల్ తెవాటియా!

తర్వాతి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాహుల్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించకపోవడంతో లఖ్‌నవూ టీమ్‌ను కృనాల్ పాండ్యా (Krunal Pandya) నడిపించనున్నాడు. రాహుల్ బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడం, వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ప్రకటించిన జట్టులో సభ్యుడు కావడంతో వెంటనే బోర్డు జోక్యం చేసుకుంది. ఇక నుంచి ఎన్‌సీఏ సలహా మేరకు రాహుల్ నడుచుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే రాహుల్ గాయం గురించి అప్‌డేట్ రాబోతోంది.

Updated Date - 2023-05-03T12:27:09+05:30 IST