India Vs NewZealand 2nd T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్

ABN , First Publish Date - 2023-01-29T18:42:29+05:30 IST

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (Indai Vs NewZealand) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (T20 series) అత్యంత కీలకమైన రెండవ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి..

India Vs NewZealand 2nd T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్

లఖ్‌నవూ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (Indai Vs NewZealand) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (T20 series) అత్యంత కీలకమైన రెండవ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంటుందనే విశ్లేషకుల అంచనాలే నిజమయ్యాయి. కాగా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న భారత్ ఆదివారం జరిగే మ్యాచ్‌‌లో విజయం సాధిస్తేనే సిరీస్ రేసులో నిలుస్తుంది. లేదంటే సిరీస్‌ కివీస్ వశమవుతుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో బౌలర్లు, టాపార్డర్‌ వైఫల్యం దెబ్బతీసింది. ముఖ్యంగా భారత పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ల అనుభవరాహిత్యం మరోసారి తేటతెల్లమైంది. టాప్‌-3 బ్యాటర్లు 15 పరుగులకే పెవిలియన్‌ చేరడం కూడా నష్టాన్ని కలిగించింది.

తుది జట్లు...

న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, డారిల్ మిచెల్, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోది, జాకబ్ డఫీ, లూకీ ఫెర్గూసన్, బ్లయర్ టిక్నర్.

భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్‌(వికెట్ కీపర్), రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Updated Date - 2023-01-29T18:43:29+05:30 IST