MIvsRCB: అయోమయంలో అంపైర్.. దానికి కూడా థర్డ్ అంపైర్‌ను అడగాలా అంటూ నెటిజన్లు ఫైర్!
ABN , First Publish Date - 2023-04-19T10:05:59+05:30 IST
క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలోకి దిగాక గేమ్ మొత్తం అంపైర్ల కనుసన్నల్లో జరుగుతుంది. అంపైర్ ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆటగాళ్లు దానిని తప్పక పాటించాల్సిందే.
క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలోకి దిగాక గేమ్ మొత్తం అంపైర్ల (Umpires) కనుసన్నల్లో జరుగుతుంది. అంపైర్ ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆటగాళ్లు దానిని తప్పక పాటించాల్సిందే. అయితే గత కొన్నేళ్లుగా సాంకేతికత (Technology) బాగా అందుబాటులోకి రావడంతో అంపైర్ల పాత్ర తగ్గిపోయింది. అంపైర్ నిర్ణయం తప్పని అనిపిస్తే కెప్టెన్లు నేరుగా థర్డ్ అంపైర్‌ను రివ్యూ (DRS)కోరవచ్చు. తాజాగా ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఐపీఎల్ (IPL 2023) మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ (Umpire Nitin Menon) ప్రవర్తన చాలా మందికి అసహనం కలిగింది. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) తన రెండో ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ నాలుగో బంతి బ్యాటర్ రాహుల్ త్రిపాటికి లైగ్ సైడ్ వైపు నుంచి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్టు భావించి అర్జున్, ఇషాన్ అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా నేరుగా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు.
IPL 2023: జియో సినిమాలో భోజ్‌పురి కామెంట్రీ సూపర్ హిట్.. కోహ్లీ ఎంతలా నవ్వుతున్నాడో చూడండి..
టీవీ రీప్లేలో ఆ బాల్ వైడ్ (Wide Ball) అని స్పష్టమైంది. దీంతో అంపైర్ వైడ్ బాల్‌గా సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైడ్ బాల్ కోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లాలా అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సనది ఆటగాళ్లని, అంపైర్లు కాదని కొందరు విమర్శిస్తున్నారు.