Nitish Rana: కోల్‌కతా‌ను కావాలనే ఓడించావా?.. నువ్వేమైనా గొప్ప బౌలర్‌వా?.. నితీష్ రాణాపై దారుణ ట్రోలింగ్!

ABN , First Publish Date - 2023-05-12T10:20:54+05:30 IST

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే ఆ పిచ్‌పై బ్యాటింగ్ కష్టం అనిపించింది. 149 పరుగులు ఛేజింగ్ చేయడం రాజస్థాన్‌కు కూడా కష్టమే అనిపించింది

Nitish Rana: కోల్‌కతా‌ను కావాలనే ఓడించావా?.. నువ్వేమైనా గొప్ప బౌలర్‌వా?.. నితీష్ రాణాపై దారుణ ట్రోలింగ్!

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా (KKR) టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే ఆ పిచ్‌పై బ్యాటింగ్ కష్టం అనిపించింది. 149 పరుగులు ఛేజింగ్ చేయడం రాజస్థాన్‌కు (RR) కూడా కష్టమే అనిపించింది. అయితే మొదటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అన్ని అనుమానాలనూ పటాపంచలు చేశాడు. మొదటి ఓవర్లోనే బౌండరీల వర్షం కురిపించి 26 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సాధారణంగా కోల్‌కతా బౌలింగ్‌ను స్పిన్నర్‌తో ఆరంభించాలనుకుంటే సునీల్ నరైన్ (Sunil Narine) మొదటి ఆప్షన్‌గా ఉంటాడు. లేదా వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ వంటి మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. వారెవరనీ కాదని కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) తొలి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్నాడు. యశస్వి జైస్వాల్ విధ్వంసానికి బలయ్యాడు. తొలి ఓవర్లోనే భారీగా పరుగులు రావడంతో రాజస్థాన్ అదే జోరును తర్వాత కూడా కొనసాగించింది. తొలి ఓవర్ వేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన నితీష్‌పై కేకేఆర్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నాడు. అతడిని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు (KKR Fans Trolling Nitish Rana).

Sreesanth: ధోనీ ఎప్పుడూ అలా చేయలేదు.. అప్పుడే ఎందుకు రిటైర్ అయ్యాడో.. శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పార్ట్ టైమ్ స్పిన్నర్ ఓవర్లో జైస్వాల్ కాస్త నిర్లక్ష్యమైన షాట్లు ఆడి వికెట్ ఇస్తాడనే ఆశతో రాణా బౌలింగ్‌కు వచ్చాడు. అయితే ఆ ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది. ``చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ``, ``రాణాను తీసెయ్యండి.. కేకేఆర్‌ను కాపాడండి``, ``షారూక్ ఖాన్ ఏమన్నాడు భయ్యా``, ``నువ్వేమైనా నెంబర్ వన్ బౌలర్ అనుకుంటున్నావా``, ``కేకేఆర్‌ను ఓడించడానికే తొలి ఓవర్ వేశాడు`` అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-12T10:20:54+05:30 IST