Nitish Rana: మ్యాచ్ గెలిచిన ఆనందంలో కోల్‌కతా కెప్టెన్ నితీష్.. భారీ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
ABN , First Publish Date - 2023-05-09T11:41:11+05:30 IST
ప్లే-ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్లే-ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సత్తా చాటింది. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో (PBKS) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 4 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకిది మూడో విజయం. సోమవారం జరిగిన మ్యాచ్‌లో (KKRvsPBKS) కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) అర్ధశతకంతో చెలరేగి విజయానికి బాటలు పరిచాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో నితీష్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ యాజమాన్యం నితీష్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించింది (Nitish Rana Fined Rs 12 Lakh).
ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో-ఓవర్ రేట్ (Slow over-rate) మెయింటైన్ చేసినందుకు గాను ఐపీఎల్ నిబంధనల కమిటీ రాణాకు ఫైన్ వేసింది. రూ.12 లక్షలు జరిమానాగా విధించింది. ఈ సీజన్‌లో (IPL 2023) ఇదే తొలిసారి కాబట్టి తక్కువ ఫైన్ విధించింది. మరోసారి రిపీట్ అయితే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తుంది. ఆ తర్వాత కూడా అలాగే జరిగితే రెండు మ్యాచ్‌ల వరకు నిషేధం విధిస్తుంది. ఈ సీజన్‌లో బెంగళూరు టీమ్ ఇప్పటికే రెండు సార్లు స్లో-ఓవర్ రేట్ కారణంగా జరిమానాలకు గురైంది.
Rahmanullah Gurbaz: డీఆర్‌ఎస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా? రహ్మనుల్లాపై అభిమానుల ఫైర్!
కేకేఆర్‌ను నడిపిస్తున్న రాణా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాణా, అయ్యర్ అవుటయ్యాక ఆండ్రూ రస్సెల్ (Andre Russell), రింకూ సింగ్ (Rinku Singh) దూకుడుగా ఆడి కోల్‌కతాను గెలిపించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.