PBKSvsLSG: పంజాబ్, లక్నో మ్యాచ్ రద్దవుతుందా? వాతావరణం కారణం కాదు.. కానీ సమస్య ఏమిటంటే..
ABN , First Publish Date - 2023-04-28T13:46:05+05:30 IST
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందిస్తోంది. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో రసవత్తరంగా సాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం పంజాబ్ కింగ్స్ లెవెన్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023) సీజన్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందిస్తోంది. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో రసవత్తరంగా సాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం పంజాబ్ కింగ్స్ లెవెన్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది (PBKSvsLSG). అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. అలాగని ఆ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఏమీ లేదు. కానీ, పంజాబ్‌లో జరుగుతున్న నిరసన సెగ ఈ మ్యాచ్‌కు తగిలేలా కనిపిస్తోంది.
మొహలీకి (Mohali) చెందిన నిహాంగ్ సిక్కులు కొద్ది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీలను విడిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొందరు నిరసనలో పాల్గొంటున్నారు. నిహాంగ్ సిక్కుల (Nihang Sikhs) అధినేత బాపు సూరత్ సింగ్ కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకుంటే శుక్రవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
CSKvsRR: రనౌట్ ఛాన్స్ మిస్.. పతిరనాపై ధోనీకి ఎంత కోపం వచ్చిందో చూశారా?
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ (PBKS) నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో లక్నోను ఓడించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పంజాబ్ కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌కు స్థానిక యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.