CSKvsMI: వామ్మో.. నమ్మశక్యం కాని క్యాచ్.. ఇద్దరూ కలిసి ఎలా పట్టేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-04-09T08:34:25+05:30 IST
టీ-20 క్రికెట్ అంటేనే వేగం. ఫీల్డర్లు తీసుకునే క్యాచ్‌లే మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తాయి. దీంతో ఫీల్డర్లు నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతారు.
టీ-20 క్రికెట్ అంటేనే వేగం. ఫీల్డర్లు తీసుకునే క్యాచ్‌లే మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తాయి. దీంతో ఫీల్డర్లు నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతారు. చక్కని బౌలింగ్‌కు తోడు, అద్భుతమైన ఫీల్డింగ్ తోడు కావడంతో శనివారం ముంబై ఇండియన్స్‌తో (MI) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో డ్వెయిన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius) బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ (Catch) మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
దక్షిణాఫ్రికా పించ్ హిట్టర్ స్టబ్స్ (Stubbs) ఇచ్చిన క్యాచ్‌ను ప్రిటోరియస్, రుతురాజ్ అద్భుతంగా అందుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టబ్స్.. మగాల వేసిన ఓవర్లో ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. ఆ బంతిని బౌండరీ అంచున నిలబడి ప్రిటోరియస్ అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ అవతల పడిపోయాడు. అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చిన రుతురాజ్ (Ruturaj Gaikwad) ఆ బంతిని అందుకోవడంతో స్టబ్స్ వెనుదిరిగాడు.
MS Dhoni: ధోనీ రివ్యూ అడిగితే మామూలుగా ఉండదు.. అద్భుతంగా క్యాచ్ పట్టడమే కాదు సూర్యను ఎలా ఔట్ చేశాడో చూడండి..
భారీ స్కోరు చేస్తుందనుకున్న ముంబైని చెన్నై బౌలర్లు, ఫీల్డర్లు కేవలం 157 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా (Ravindra Jadeja), శాంట్నర్ ముంబై బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రహానే (Ajinkya Rahane) కారణంగా సులభంగా టార్గెట్ పూర్తి చేసింది.