Share News

తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌తో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-01T23:56:11+05:30 IST

గత 9 సీజన్‌‌లుగా కబడ్డీ అభిమానులు అలరిస్తోన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 పోటీలు 2 డిసెంబరు, 2023 నుండి 21 ఫిబ్రవరి, 2023 వరకు జరుగనున్నాయి.

తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌తో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ప్రారంభం

హైదరాబాద్: గత 9 సీజన్‌‌లుగా కబడ్డీ అభిమానులు అలరిస్తోన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 పోటీలు 2 డిసెంబరు, 2023 నుండి 21 ఫిబ్రవరి, 2023 వరకు జరుగనున్నాయి. ప్లే-ఆఫ్‌లు త్వరలోనే తెలియజేయబడతాయి. పికెఎల్ సీజన్ 10 కోసం కొత్త జట్టును తెలుగు టైటాన్స్ ప్రకటించింది. ప్లేఆఫ్ రౌండ్‌లోకి ప్రవేశించిన టాప్ సిక్స్‌తో ఇతర 11 జట్ల మాదిరిగానే తెలుగు టైటాన్స్ 22 లీగ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. తెలుగు టైటాన్స్ సీజన్ 10కి పవన్ కుమార్ సెహ్రావత్‌ను కెప్టెన్‌గా మరియు పర్వేష్ భైన్‌స్వాల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.

టీమ్ తెలుగు టైటాన్స్ సీజన్ 10:

డిఫెండర్లు: పర్వేష్ భైన్‌స్వాల్, మోహిత్, నితిన్, అంకిత్, సి మిలాద్ జబ్బారి (విదేశీ), గౌరవ్ దహియా, అజిత్ పాండురంగ్ పవార్, మోహిత్, సందీప్ ధుల్.

ఆల్ రౌండర్లు: రజనీష్, సంజీవి ఎస్, బి హమీద్ మీర్జాయ్ నాడర్ (విదేశీ), శంకర్ భీమ్‌రాజ్ గడై, ఓంకార్ ఆర్ మోర్.

రైడర్స్: పవన్ కుమార్ సెహ్రావత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, రాబిన్ చౌదరి.

ప్రధాన కోచ్: శ్రీనివాస్ రెడ్డి మరియు సహాయ కోచ్‌గా అలెక్స్ పాండియన్.

Pro-Kabaddi.jpg

నూతన జట్టును ప్రకటించిన సందర్భంగా తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..ఇండియా ఇంటర్నేషనల్ ఆటగాడు పవన్ కుమార్ సెహ్రావత్‌ను ఈ ఏడాది వేలంలో రికార్డు స్థాయిలో రూ. 2.605 కోట్లకు తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధికంగా చెల్లించిన ఆటగాడిగా నిలిచాడు. కబడ్డీ క్రీడను కొనసాగించే వారందరికీ జీవితంలో మరియు వృత్తిలో గౌరవ భావాన్ని తెలుగు టైటాన్స్ తీసుకువచ్చింది. లీగ్ (PKL) 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఆకాశమే హద్దుగా ఈ క్రీడ విస్తరించింది. అశేషమైన అభిమానులకు ఇష్టమైన క్రీడగానూ మారిందని అన్నారు. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ కబడ్డీ అథ్లెట్లు తెలుగు టైటాన్స్‌లో ఆడేలా చూసుకున్నాము. నేడు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఆడే యువత చాలా ఎక్కువ. అత్యధిక ధర పలికిన వ్యక్తిగా పవన్ తన రికార్డును తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్ భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అదే సమయంలో, స్టార్ నెట్‌వర్క్‌లో వివిధ ప్రాంతీయ భాషల్లో గేమ్‌లను కూడా ఆస్వాదించవచ్చు. లీగ్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా ఉచితంగా వీక్షించవచ్చు.

ప్రో కబడ్డీ సీజన్ 10 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌ల వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (Telugu Titans Schedule)

2nd Dec 2023 Saturday 8pm onwards Telugu Titans vs Gujarat Giants

6th Dec 2023 Wednesday 8pm onwards Telugu Titans vs Patna Pirates

9th Dec 2023 Saturday 9pm onwards Telugu Titans vs U.P. Yoddhas

13th Dec 2023 Wednesday 8pm onwards Telugu Titans vs Tamil Thalaivas

16th Dec 2023 Saturday 9pm onwards Telugu Titans vs Dabang Delhi K.C.

22nd Dec 2023 Friday 9pm onwards Telugu Titans vs Haryana Steelers

24th Dec 2023 Sunday 9pm onwards Telugu Titans vs Bengaluru Bulls

30th Dec 2023 Saturday 8pm onwards Telugu Titans vs U Mumba

1st Jan 2023 Monday 8pm onwards Telugu Titans vs Puneri Paltan

6th Jan 2023 Saturday 9pm onwards Telugu Titans vs Jaipur Gujarat Gaints

9th Jan 2023 Tuesday 8pm onwards Telugu Titans vs Bengal Warriors

12th Jan 2023 Friday 8pm onwards Telugu Titans vs Jaipur Pink Panthers

19th Jan 2023 Friday 9pm onwards Telugu Titans vs Bengaluru Bulls

20th Jan 2023 Saturday 9pm onwards Telugu Titans vs U.P. Yoddhas

22nd Jan 2023 Monday 9pm onwards Telugu Titans vs Haryana Steelers

24th Jan 2023 Wednesday 9pm onwards Telugu Titans vs Tamil Thalaivas

30th Jan 2023 Tuesday 8pm onwards Telugu Titans vs Puneri Paltan

3rd Feb 2023 Saturday 9pm onwards Telugu Titans vs Dabang Delhi K.C

10th Feb 2023 Saturday 9pm onwards Telugu Titans vs Bengal Warriors

13th Feb 2023 Tuesday 8pm onwards Telugu Titans vs Patna Pirates

16th Feb 2023 Friday 9pm onwards Telugu Titans vs Jaipur Pink Panthers

20th Feb 2023 Tuesday 8pm onwards Telugu Titans vs U Mumba

Updated Date - 2023-12-01T23:56:12+05:30 IST