Virat Kohli: ఇంజనీరింగ్ పరీక్షా పత్రంలో కోహ్లీ గురించి ప్రశ్న.. నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN , First Publish Date - 2023-04-29T13:09:33+05:30 IST
పరుగుల యంత్రం ``కింగ్`` కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ బ్యాటింగ్ శైలిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. గతేడాది ఫామ్ కోల్పోయి తంటాలు పడిన కోహ్లీ మళ్లీ పుంజుకున్నాడు.
పరుగుల యంత్రం ``కింగ్`` కోహ్లీ (Virat Kohli)కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ బ్యాటింగ్ శైలిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. గతేడాది ఫామ్ కోల్పోయి తంటాలు పడిన కోహ్లీ మళ్లీ పుంజుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సత్తా చాటాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కూడా దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ క్రేజ్ మళ్లీ తారస్థాయికి చేరింది. తాజాగా తమిళనాడులోని (TamilNadu) ఓ యూనివర్సీటీ ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రంలో కోహ్లీ గురించి ఓ ప్రశ్న వచ్చింది (Question On Virat Kohli in Engineering Exam).
చెన్నైలో (Chennai) ఉన్న శివ నాడార్ యూనివర్సీటీ ప్రస్తుతం ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. రెండో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ పరీక్షలో కోహ్లీ గురించి ఓ ప్రశ్న ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లీ చేసిన పరుగుల జాబితాను ఇచ్చి.. 2023లో 23 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఎన్ని పరుగులు చేయగలడు? అని ప్రశ్నించారు. కోహ్లీ గత పరుగుల జాబితా ఆధారంగా ఈ ఏడాది ప్రదర్శనను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. నెటిజన్లు ఈ ప్రశ్నపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Kyle Mayers: వామ్మో.. ఇదేం సిక్స్‌రా బాబోయ్.. బంతి ఆకాశంలోకి వెళ్లిపోయినట్టుంది.. వైరల్ అవుతున్న వీడియో!
``చెన్నైలో ధోనీ కంటే కోహ్లీకే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టుంది``, ``క్రికెట్ గురించి మాట్లాడుకోవాలంటే కోహ్లీని ప్రస్తావించాల్సిందే``, ``ఇంతకీ ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి?`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతూ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.