Rajasthan vs Gujarat: గుజరాత్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్.. ఏం ఎంచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2023-05-05T19:27:12+05:30 IST

ఐపీఎల్ 2023లో (IPL 2023) మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) టాస్ పడింది.

Rajasthan vs Gujarat: గుజరాత్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్.. ఏం ఎంచుకున్నాడంటే..

జైపూర్: ఐపీఎల్ 2023లో (IPL 2023) మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) మ్యాచ్‌లో టాస్ పడింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించాడు. హోల్డర్ స్థానంలో ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకున్నట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక 10 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టాప్‌లోకి దూసుకెళ్లాలని రాజస్థాన్ భావిస్తుండగా.. మరో విజయంతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి.

తుదిజట్లు..

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, జోషువా లిటిల్.

రాజస్థాన్ రాయల్స్: యశ్వశ్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), దేవధూత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్.

Updated Date - 2023-05-05T19:28:45+05:30 IST