Rashid Khan Hat-trick: హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టిన రషీద్ ఖాన్.. వీడియో చూశారా!
ABN , First Publish Date - 2023-04-10T12:04:05+05:30 IST
టీ-20 క్రికెట్‌లో నెంబర్ వన్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శతో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.
టీ-20 క్రికెట్‌లో నెంబర్ వన్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) అద్భుత బౌలింగ్ ప్రదర్శతో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ను (Rashid Khan Hat-trick) నమోదు చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం కేకేఆర్‌తో (KKR) జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను రషీద్ పెవిలియన్‌కు పంపించాడు.
ఐపీఎల్‌లో (IPL 2023) భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (GTvsKKR)భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా మూడో వికెట్‌కు వంద రన్స్ జత చేసి ఆదుకున్నారు. ముఖ్యంగా వెంకటేశ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరినీ జోసెఫ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 17వ ఓవర్లో రస్సెల్ (1), నరైన్ (0), శార్దూల్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చిన రషీద్ హ్యాట్రిక్‌తో గుజరాత్‌కు గెలుపు ఖాయమన్నట్టు చేశాడు. ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.
Rinku Singh: రెండో సిక్స్ కొట్టాక నమ్మకం కలిగింది.. రింకూ ఇన్నింగ్స్‌పై కేకేఆర్ కెప్టెన్ ప్రశంసలు!
రషీద్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ (Rinku Singh) నమ్మశక్యం కాని రీతిలో విధ్వంసం సృష్టించి చివరి ఓవర్లో ఏకంగా 30 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. రింకూ ఇన్నింగ్స్ ముందు రిషీద్ హ్యాట్రిక్ ఘనతకు పెద్దగా గుర్తింపు రాలేదు.