Rashid Khan: వావ్.. రషీద్ ఖాన్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూపర్ క్యాచ్.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-05-08T10:30:04+05:30 IST
``క్యాచెస్ విన్ మ్యాచెస్`` అంటారు. క్యాచ్‌లే మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. టీ-20 క్రికెట్లో అయితే క్యాచ్‌లు మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
``క్యాచెస్ విన్ మ్యాచెస్`` అంటారు. క్యాచ్‌లే (Catch) మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. టీ-20 క్రికెట్లో అయితే క్యాచ్‌లు మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ (LSGvsGT) జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన లఖ్‌నవూకు అదిరిపోయే ఆరంభం లభించింది.
ఓపెనర్లు కైల్ మేయర్స్ (Kyle Mayers) (48), డికాక్ (Quinton de Kock) (70) తొలి వికెట్‌కు ఏకంగా 88 పరుగులు జోడించారు. వీరి జోరు చూస్తే గుజరాత్ కొట్టిన భారీ స్కోరును ఛేజ్ చేస్తారనిపించింది. అయితే రషీద్ ఖాన్ (Rashid Khan) స్క్వేర్ లెగ్‌లో పరిగెత్తుకుంటూ పట్టిన సూపర్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 8 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఆ సమయంలో మోహిత్ శర్మ (Mohit Sharma) 9వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్లో మోహిత్ వేసిన స్లో షార్ట్ బాల్‌ను మేయర్స్ హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
Sanju Samson: సంజూ శాంసన్‌కు ఏమైంది? వికెట్ల వెనుక పేలవ ప్రదర్శన.. లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో!
ఆ షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రషీద్ ఖాన్ 26 మీటర్ల దూరం పరిగెత్తి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. మేయర్స్ అవుట్ కావడంతో లఖ్‌నవూ స్కోరు బోర్డు నెమ్మదించింది. మరో ఎండ్‌లో డికాక్ ఆడుతున్నా.. అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. దీంతో లఖ్‌నవూ టీమ్ 56 పరుగుల తేడాతో ఓడిపోయింది.