Virat Kohli Out: బిష్ణోయ్ ట్రాప్‌లో చిక్కిన కోహ్లీ.. ఎలా అవుట్ అయ్యాడో చూడండి..
ABN , First Publish Date - 2023-05-02T08:53:52+05:30 IST
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మెరుపు వేగంతో పరుగులు చేస్తున్నాడు. అయితే తన స్పిన్ బలహీనతను మాత్రం అధిగమించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5 సార్లు స్పిన్నర్ల చేతిలోనే అవుటయ్యాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) అద్భుతంగా రాణిస్తున్నాడు. మెరుపు వేగంతో పరుగులు చేస్తున్నాడు. అయితే తన స్పిన్ బలహీనతను మాత్రం అధిగమించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5 సార్లు స్పిన్నర్ల చేతిలోనే అవుటయ్యాడు. ముఖ్యంగా లెగ్-స్పిన్ ఆడే విషయంలో కోహ్లీ తడబడడం అనేది ఎప్పట్నుంచో ఉంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో (LSGvsRCB) కోహ్లీని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) తెలివిగా అవుట్ చేశాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా బిష్ణోయ్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికి కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకుని భారీ షాట్లు ఆడేందుకు సిద్ధమవుతున్న కోహ్లీని బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు. 9వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ కొట్టేందుకు కోహ్లీ క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన బిష్ణోయ్ గూగ్లీ వేశాడు. దీంతో ఆ బాల్‌ను కనెక్ట్ చేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కీపర్ పూరన్ వెంటనే బాల్ అందుకుని కోహ్లీని స్టంపౌట్ చేశాడు.
Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. బీసీసీఐ సీరియస్.. ఇద్దరికీ భారీ జరిమానా!
సోమవారం జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో లఖ్‌నవూ చతికిల పడింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసి (44), కోహ్లీ (31) రాణించారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 108 పరుగులకే ఆలౌటై అనూహ్యంగా 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.