Ravindra Jadeja: జడేజాకు కోపమొచ్చింది.. క్యాచ్ అడ్డుకున్న క్లాసెన్.. అదే ఓవర్లో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-04-22T08:52:27+05:30 IST
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతుండడంతో వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతుండడంతో వరుస పరాజయాలతో సతమతమవుతోంది. తాజాగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ (CSKvsSRH) జరిగింది. ఈ మ్యాచ్‌లో జడేజా (Ravindra Jadeja) అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కీపర్ క్లాసెన్‌తో (Klaasen) జడేజాకు వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) స్ట్రైట్‌గా ఆడాడు. అది గాల్లోకి లేవడంతో జడేజా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న క్లాసెన్ అడ్డుగా ఉండడంతో జడేజా క్యాచ్ పట్టలేక కింద పడిపోయాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత బంతికి కూడా ఇద్దరూ కోపంగా చూసుకున్నారు. అయితే క్లాసెన్ వల్ల వచ్చిన లైఫ్‌ను మయాంక్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
IPL 2023: ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌కు యాపిల్ సీఈవో హాజరు.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌తో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేసిన టిమ్ కుక్!
అదే ఓవర్లో జడేజా ఆఫ్‌సైడ్ వేసిన ఐదో బంతిని ఆడేందుకు మయాంక్ ముందుకు వచ్చాడు. బంతి మిస్ అయి కీపర్ ధోనీ (MS Dhoni) చేతుల్లో పడింది. ధోనీ వెంటనే మెరుపు వేగంతో స్టంప్ చేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. మయాంక్‌ను అవుట్ చేసిన తర్వాత మరోసారి క్లాసెన్ వైపు జడేజా సీరియస్‌గా చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.