RCBvsLSG: కచ్చితంగా గెలుస్తామనుకున్నా.. అందువల్లే ఓడిపోయాం.. ఓటమిపై డుప్లెసిస్ నిరాశ!

ABN , First Publish Date - 2023-04-11T14:45:54+05:30 IST

ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. ముఖ్యంగా సోమవారం స్వంత మైదానంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓటమి బెంగళూరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశ కలిగించింది.

RCBvsLSG: కచ్చితంగా గెలుస్తామనుకున్నా.. అందువల్లే ఓడిపోయాం.. ఓటమిపై డుప్లెసిస్ నిరాశ!

ఈ ఐపీఎల్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. ముఖ్యంగా సోమవారం స్వంత మైదానంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG)తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓటమి బెంగళూరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశ కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసినా, తర్వాత ప్రత్యర్థి జట్టు వికెట్లు త్వరగానే పడగొట్టినా బెంగళూరు మాత్రం విజయతీరాలకు చేరలేకపోయింది. ఈ మ్యాచ్ ఓటమిపై బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (Faf du Plessis) స్పందించాడు.

``ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా నిరాశ కలిగించింది. చాలా బ్యాడ్ లక్. లక్నో బ్యాట్స్‌మెన్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నారు. స్టోయినిస్, పూరన్ అద్భుతంగా ఆడారు. ఒక్క బంతికి ఒక్క పరుగు కావాల్సినపుడు కచ్చితంగా రనౌట్ అవుతుందని భావించాను. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మ్యాచ్ చాలా వరకు మా నియంత్రణలోనే ఉంది. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. తర్వాతి మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామ``ని డుప్లెసిస్ అన్నాడు.

Dinesh Karthik: సారీ ధోనీ అంటూ కార్తీక్‌పై భారీగా ట్రోలింగ్.. ఆ బాల్ కనుక పట్టి ఉంటే..

కాగా, ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకులేని చెత్త రికార్డు బెంగళూరు పేరిటే ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 5 సార్లు 200 ప్లస్ స్కోరు చేసినా ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో మరే జట్టు ఇన్నిసార్లు ఇలా ఓటమి పాలుకాలేదు.

Updated Date - 2023-04-11T14:45:54+05:30 IST