Rinku Singh: ఇదెక్కడి బ్యాటింగ్‌రా బాబోయ్.. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2023-04-10T08:57:51+05:30 IST

రింకూ సింగ్.. ఒక్క ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఒక్క ఓవర్లో నమశక్మం కాని ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఓటమి తథ్యం అనే దశలో వీరోచితంగా ఆడి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

Rinku Singh: ఇదెక్కడి బ్యాటింగ్‌రా బాబోయ్.. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో

రింకూ సింగ్ (Rinku Singh).. ఒక్క ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఒక్క ఓవర్లో నమశక్మం కాని ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఓటమి తథ్యం అనే దశలో వీరోచితంగా ఆడి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మ్యాచ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు (Five Sixes) కొట్టి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKRvsGT), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 3 వికెట్లతో అనూహ్య విజయం సాధించింది.

రింకూ సింగ్ వచ్చే సరికి మ్యాచ్ విజయంపై కోల్‌కతా జట్టులో (KKR) ఎవరికీ ఆశలు లేవు. విజయం తమదే అని గుజరాత్ టీమ్‌కు (GT) కూడా ధీమా వచ్చేసింది. మొదట్లో రింకూ కూడా సింగిల్స్ తీస్తూ మరింత విసిగించాడు. జోష్‌ లిటిల్‌ వేసిన 19వ ఓవర్లో 6, 4తో కోల్‌కతాలో ఆశలు రేపాడు. ఇక, చివరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 పరుగులు కావాలి. పేసర్‌ యశ్‌ దయాళ్‌ (Yash Dayal) వేసిన 20వ ఓవర్‌ తొలి బంతికి ఉమేశ్‌ ఒక పరుగు తీసి రింకూకు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి రింకూ విధ్వంసం మొదలైంది. ఆఫ్‌ స్టంప్‌ అవతల వేసిన బంతిని రింకూ లాంగాఫ్‌ దిశగా సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత యశ్ వేసిన రెండు టాస్ బాల్స్‌ను కూడా బౌండరీ అవతలకు తరలించాడు.

Rohit Sharma: నాతో సహా అందరూ మారాలి.. వరుస ఓటములపై రోహిత్ నిరాశ..!

అప్పటికే రింకూ మూడు సిక్స్‌లు కొట్టడంతో గుజరాత్ ఆటగాళ్లలో టెన్షన్ మొదలైంది. ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వచ్చిన ఐదో బంతిని లాంగాన్‌ దిశగా బాదేశాడు. చివరి బంతికి మరో సిక్స్ కొడితే విజయం కోల్‌కతాదే. దీంతో గుజరాత్ కెప్టెన్ రషీద్, ఆటగాళ్లు గ్రౌండ్‌ మధ్యలో సమావేశమై ఆఖరి బంతిని ఎలా వేయించాలనేది చర్చించారు. చివరకు ఆ బంతిని కూడా యశ్ ఆఫ్‌స్టంప్ అవతల వేశాడు. ఆ బంతిని రింకూ లాంగాన్‌ దిశగా అలవోకగా సిక్సర్‌కు తరలించాడు. దీంతో కోల్‌కతా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

Updated Date - 2023-04-10T08:57:51+05:30 IST