Rinku Singh: రింకూ సింగ్‌ది ఎంత పెద్ద మనసు.. పేద క్రికెటర్ల కోసం హాస్టల్ కట్టిస్తున్న కోల్‌కతా బ్యాటర్!

ABN , First Publish Date - 2023-04-18T10:05:48+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోంది. ట్యాలెంటెడ్ క్రికెటర్లకు అవకాశాలు కల్పించి వారిని ఓవర్ నైట్ స్టార్లను చేస్తోంది.

Rinku Singh: రింకూ సింగ్‌ది ఎంత పెద్ద మనసు.. పేద క్రికెటర్ల కోసం హాస్టల్ కట్టిస్తున్న కోల్‌కతా బ్యాటర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోంది. ట్యాలెంటెడ్ క్రికెటర్లకు అవకాశాలు కల్పించి వారిని ఓవర్ నైట్ స్టార్లను చేస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యువ సంచలనం రింకూ సింగ్ (Rinku Singh) ఇటీవల ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టి తన జట్టుకు మరపురాని విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రింకూ పేరు మారుమోగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన రింకూ సింగ్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.

కోల్‌కతా టీమ్‌కు ఎంపిక కావడంతో ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడ్డాడు. అయితే మిగత స్టార్ క్రికెటర్లతో పోల్చుకుంటే రింకూ సంపాదన చాలా అంటే చాలా తక్కువ. అయినా తనకు ఉన్న దాంతోనే ఇతరులకు సహాయపడాలని రింకూ నిర్ణయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యువ క్రికెటర్ల కోసం అలీగఢ్‌లో హాస్టల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు (Rinku Singh spends lakhs to build hostel ). ఇందుకోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చుపెడుతున్నాడు. రింకూ చిన్ననాటి కోచ్ జాఫర్ అలీగఢ్‌లో క్రికెట్ స్కూల్, అకాడమీ నడిపిస్తున్నారు. అక్కడే రింకూ తన కొత్త హాస్టల్ నిర్మించనున్నాడు.

Viral Video: బౌండరీ లైన్ వద్ద రహానే కళ్లు చెదిరే ఫీల్డింగ్.. సిక్స్‌ను ఎలా ఆపాడో చూడండి..!

ఇప్పటికే పని మొదలుపెట్టి 3 నెలలు పూర్తవుతోందని, మరో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని కోచ్ జాఫర్ తెలిపారు. ఐపీఎల్ పూర్తయ్యాక రింకూ ఈ హాస్టల్‌ను ప్రారంభిస్తాడని తెలిపారు. 2018లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో రింకూను కేకేఆర్ టీమ్ రూ.80 లక్షలకు కొనుక్కుంది. అప్పట్నుంచి రింకూ కోల్‌కతా టీమ్‌కే ఆడుతున్నడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై (GTvsKKR) చివరి ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టడంతో అతడికి ఎనలేని గుర్తింపు దక్కింది.

Updated Date - 2023-04-18T10:05:48+05:30 IST