Rishabh Pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి చేశాడు..!
ABN , First Publish Date - 2023-04-05T08:22:12+05:30 IST
టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నాలుగు నెలల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమితయ్యాడు.
టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) నాలుగు నెలల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమితయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మెల్లిగా అడుగులేస్తున్నాడు. దీంతో ప్రస్తుత ఐపీఎల్‌కు (IPL 2023) దూరమైన సంగతి తెలిసిందే. పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు డేవిడ్ వార్నర్ (David Warner) నాయకత్వం వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (GT) ఢిల్లీ టీమ్ మ్యాచ్ ఆడింది.
ఆ మ్యాచ్ చూసేందుకు పంత్ స్టేడియానికి వచ్చాడు. గ్యాలరీలో కూర్చుని ఢిల్లీ ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. చేతికర్ర సహాయంతో నడుస్తూ వచ్చిన పంత్, బీసీసీఐ అధికారులు కూర్చునే గ్యాలరీలో నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో తమ డగౌట్‌కు ఢిల్లీ టీమ్ పంత్ జెర్సీని (Pant Jersey) వేలాడదీయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలా చేయడం తప్పని ఢిల్లీ టీమ్‌కు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
IPL 2023: ఐపీఎల్‌లో సఫారీల హవా.. అందరూ మ్యాచ్ విన్నర్లే.. కానీ, అభిమానులకు మాత్రం నిరాశే..
కాగా, మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ ఓటమిపాలైంది (DCvsGT). ఢిల్లీ తమ ముందు నిలిపిన 163 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి గుజరాత్ టైటాన్స్ ఛేదించింది. ఈ ఐపీఎల్‌లో గుజరాత్‌కిది వరుసగా రెండో విజయం కాగా, ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి.