Rohit Sharma: కీపర్ ఇషాన్ కిషన్ ప్రవర్తనతో రోహిత్ షాక్.. అవుట్ చేసినా అప్పీలు చేయకపోవడంతో..
ABN , First Publish Date - 2023-05-17T10:19:55+05:30 IST
ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్‌ది కీలక పాత్ర. వికెట్ల వెనుక ఉంటూ బౌలర్‌కు మద్దతుగా ఉండాలి. బ్యాట్స్‌మెన్ అవుట్ అనుకున్నప్పుడు వెంటనే అంపైర్‌కు అప్పీలు చేయాలి.
ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్‌ది (Wicket-Keeper) కీలక పాత్ర. వికెట్ల వెనుక ఉంటూ బౌలర్‌కు మద్దతుగా ఉండాలి. బ్యాట్స్‌మెన్ అవుట్ అనుకున్నప్పుడు వెంటనే అంపైర్‌కు అప్పీలు చేయాలి. బ్యాట్స్‌మెన్ అవుట్ అని చిన్న అనుమానం వస్తే చాలు చాలా మంది కీపర్లు పెద్దగా అరుస్తూ అప్పీలు చేస్తారు. అయితే ముంబై ఇండియన్స్ (MI) కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (MIvsLSG) కాస్త భిన్నంగా ప్రవర్తించాడు. బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్‌ను తీసుకుని సైలెంట్‌గా ఉండిపోయాడు. దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) కాస్త అసహనానికి గురయ్యాడు.
లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్పిన్నర్ పియూష్ చావ్లా (Piyush Chawla) బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. లఖ్‌నవూ ఓపెనర్ డికాక్ (Quinton De Kock) క్రీజులో ఉన్నాడు. పియూష్ చావ్లా వేసిన బంతిని డికాక్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ కిషన్ చేతుల్లో పడింది. కిషన్ ఆ క్యాచ్ పట్టి బెయిల్స్ పడగొట్టి సైలెంట్‌గా ముందుకు వెళ్లాడు. అయితే కిషాన్ అప్పీలు చేయకుండా అలా సైలెంట్‌గా ఉండిపోవడంతో రోహిత్ అయోమయానికి గురయ్యాడు.
Surya Kumar Yadav: అన్ని సార్లూ కుదరదు సూర్య.. తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించి సూర్య ఎలా అవుటయ్యాడో చూడండి..
ఇషాన్ కిషన్‌వైపు చూస్తూ ప్రశ్నించాడు. అప్పుడు కిషాన్ అంపైర్ వైపు చూసి అప్పీలు చేశాడు. అయితే అప్పటికే డికాక్ క్రీజు వదిలి వెళ్లిపోతున్నాడు. అప్పుడు అంపైర్ అవుట్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లఖ్‌నవూ టీమ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.