Rohit Sharma: నాతో సహా అందరూ మారాలి.. వరుస ఓటములపై రోహిత్ నిరాశ..!
ABN , First Publish Date - 2023-04-09T14:49:44+05:30 IST
ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2023)ను ముంబై ఇండియన్స్ (MI) జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. జట్టులో రోహిత్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నా ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2023)ను ముంబై ఇండియన్స్ (MI) జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. జట్టులో రోహిత్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నా ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. శనివారం చెన్నైతో (CSK)జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. నిజానికి రోహిత్, ఇషాన్ ముంబైకి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. అయితే తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ త్వరగా ఔట్ అయిపోవడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఆరంభంలో ముంబై జోరు చూస్తే కచ్చితంగా 200 పరుగులు ఖాయం అనిపించింది. అయితే చెన్నై స్పిన్నర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. మ్యాచ్ అనంతరం రోహిత్ (Rohit Sharma) మాట్లాడుతూ.. ``మా జట్టు చాలా విషయాల్లో మారాలి. జట్టులోని యువ ఆటగాళ్లు రాణించడానికి కాస్త సమయం పడుతుంది. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. సీనియర్ ఆటగాళ్లలో మార్పు రావాలి. ఆ మార్పు నా నుంచే మొదలు కావాలి. నిజానికి ఇప్పుడే అంతా అయిపోలేదు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాం. ఇకపై తీరు మారాలి. ఈ మ్యాచ్‌లో మేం అదనంగా మరో 40 పరుగులు చేసి ఉండాల్సింద``ని రోహిత్ అన్నాడు.
IPL2023 Rahane: నిన్న రాత్రి ముంబైపై రహానే అదరగొట్టాడు.. కానీ టాస్‌కు కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందంటే..
శనివారం జరిగిన మ్యాచ్‌లో (MIvsCSK)ముంబై జట్టులో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ మాత్రమే 30 పరుగులు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. రోహిత్ తనకు దక్కిన శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మలచలేకపోయాడు. మంగళవారం జరగబోయే మ్యాచ్‌లో ఢిల్లీతో ముంబై టీమ్ తలపడనుంది (MIvsDC). మరి, ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ సేన విజయం సాధిస్తుందేమో చూడాలి.