Rohit Sharma: ప్రస్తుతం నా ఫామ్‌తో సంతోషంగా ఉన్నా.. అర్జున్‌కు పూర్తిగా క్లారిటీ ఉంది..!
ABN , First Publish Date - 2023-04-19T12:16:37+05:30 IST
ఐపీఎల్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్‌లో (IPL 2023) రోహిత్ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (MI) జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (SRHvsMI)గెలిచి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి ముంబైకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చేస్తున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు.
``హైదరాబాద్‌లో (Hyderabad) నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. డెక్కన్ ఛార్జర్స్ తరఫున మూడేళ్లు హైదరాబాద్‌లోనే ఆడాను. టైటిల్ కూడా సాధించాం. ఇక్కడ ఆడడం నాకెప్పుడూ ప్రత్యేకమే. ప్రస్తుతం మా టీమ్ మంచి సమతూకంతో ఉంది. ప్రస్తుతం నా ఫామ్‌తో సంతోషంగా ఉన్నా. ఓపెనర్‌గా నేనేం చేయాలో నాకు తెలుసు. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అందువల్లే టాపార్డర్‌లో మాపై పెద్దగా ఒత్తిడి లేదు. తిలక్ వర్మ (Tilak Varma)సామర్థ్యం గురించి మాకు తెలుసు. భవిష్యత్తులో అతనేం చేస్తాడనే దానిపై కూడా నమ్మకం ఉంది.
MIvsRCB: అయోమయంలో అంపైర్.. దానికి కూడా థర్డ్ అంపైర్‌ను అడగాలా అంటూ నెటిజన్లు ఫైర్!
ఇక అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) మూడేళ్లుగా టీమ్‌తో పాటు ఉంటున్నాడు. అతనికి తన సామర్థ్యంపై పూర్తి క్లారిటీ ఉంది. తనపై తనకు నమ్మకం ఉంది. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలుగుతున్నాడు. అలాగే డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంపై కూడా పట్టు సాధించాడ``ని రోహిత్ పేర్కొన్నాడు.