IPL 2023: వాళ్లిద్దరినీ తీసేస్తేనే జట్టుకు మంచిది.. యువ ఆటగాళ్లపై రాజస్థాన్ అభిమానులు ఫైర్!
ABN , First Publish Date - 2023-05-06T12:06:37+05:30 IST
గతేడాది అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడి ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను కూడా సాధికారికంగానే ప్రారంభించింది.
గతేడాది అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడి ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను (IPL 2023) కూడా సాధికారికంగానే ప్రారంభించింది. అయితే కీలక దశలో మాత్రం తడబడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. శుక్రవారం గుజరాత్ టైటన్స్‌తో (GTvsRR) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడి భారీ ఓటమిని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ కూర్పుపై ఆర్ఆర్ ఫ్యాన్స్ (RR Fans) అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న రాజస్థాన్ కేవలం 118 పరుగులు మాత్రమే చేసింది. యువ ఆటగాళ్లైన దేవదత్ పడిక్కళ్ (Devdutt Padikkal) (12), రియాన్ పరాగ్ (Riyan Parag) (4) మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్ టీమ్ పరాగ్‌ను రూ.3.8 కోట్లకు, పడిక్కళ్‌ను 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో పరాగ్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 58 పరుగులు మాత్రమే చేస్తే.. పడిక్కళ్ 9 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జట్టుకు భారంగా మారారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించి ప్రతిభావంతులకు అవకాశాలివ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ సూపర్ సిక్స్.. కెమేరా మ్యాన్‌కు తగలడంతో షాక్.. వీడియో వైరల్!
రియాన్ పరాగ్ తాజాగా నెట్ ప్రాక్టీస్‌లో భారీ సిక్స్‌లు కొడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు అతడిపై ట్రోలింగ్ ప్రారంభించారు (Fans trolls Riyan Parag). ``నువ్వు నిజంగా సీరియస్‌గా లేకపోతే క్రికెట్ వదిలేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వు బ్రదర్``, ``నెట్స్‌లో ఎవరైనా కొడతారు.. మైదానంలో కొట్టేవాడే క్రికెటర్``, ``బహుశా బంతులు ఎక్కడ వేయాలో బౌలర్‌కు చెప్పి ఉంటావు`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.