SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-08T11:13:27+05:30 IST

డ్రామా లేకపోతే సినిమాలో అయినా క్రికెట్‌లో అయినా మజా ఏముంటుంది? ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోపెట్టింది.

SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..

డ్రామా లేకపోతే సినిమాలో అయినా క్రికెట్‌లో అయినా మజా ఏముంటుంది? ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల (RRvsSRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోపెట్టింది. అనేక మలుపులు తిరిగి సూపర్ థ్రిల్ అందించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. బట్లర్‌ (Jos Buttler) (95), సంజూ శాంసన్‌ (Sanju Samson) (66 నాటౌట్‌) రాణించారు. తర్వాత ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి.

భారీ ఛేదనను రైజర్స్‌ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వెనుకబడి పోయింది. మధ్య ఓవర్లలో ఆర్‌ఆర్‌ స్పిన్నర్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చాహల్ 4 వికెట్లతో హైదరాబాద్ మిడిలార్డర్‌ వెన్ను విరిచాడు. అయితే ఫిలిప్స్ (Glenn Phillips) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ (Sandeep Sharma) ఆ ఓవర్ వసేందుకు వచ్చాడు. మొదటి ఐదు బంతుల్లో 12 పరుగులు వచ్చాయి.

Rashid Khan: వావ్.. రషీద్ ఖాన్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూపర్ క్యాచ్.. వీడియో వైరల్!

రాజస్థాన్ విజయానికి చివరి బాల్‌కు 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో సందీప్ వేసిన చివరి బంతికి అబ్దుల్ సమద్ (Abdul Samad) క్యాచ్ అవుటయ్యాడు. రాజస్థాన్ సంబరంలో మునిగిపోయింది. అయితే అది నో బాల్ (No-Ball) అని అంపైర్ ప్రకటించారు. దీంతో చివరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. ఆ బంతికి సమద్ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ విజయం సాధించింది. కొన్ని సెకెన్ల వ్యవధిలోనే సందీప్ శర్మ హీరో నుంచి జీరోగా మారిపోయాడు.

Updated Date - 2023-05-08T11:13:27+05:30 IST