Sanju Samson: సంజూ శాంసన్‌కు ఏమైంది? వికెట్ల వెనుక పేలవ ప్రదర్శన.. లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో!

ABN , First Publish Date - 2023-05-08T09:53:58+05:30 IST

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు. స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు చేయడంలో ధోనీకి సాటి వచ్చే కీపర్ భారత్‌లో అంతకు ముందు లేరు, ఆ తర్వాతా లేరనే చెప్పాలి.

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఏమైంది? వికెట్ల వెనుక పేలవ ప్రదర్శన.. లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో!

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు. స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు చేయడంలో ధోనీకి సాటి వచ్చే కీపర్ భారత్‌లో అంతకు ముందు లేరు, ఆ తర్వాతా లేరనే చెప్పాలి. ధోనీతో పోలిస్తే ఇప్పటి యంగ్ వికెట్ కీపర్లు తేలిపోతారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల (RRvsSRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం దొరికింది. ఓపెనర్ అభిషేక్ (Abhishek Sharma) (55) అద్భుత అర్ధశతకంతో చెలరేగాడు. అభిషేక్ 20 బంతుల్లో 40 పరుగులు మీద ఉన్నప్పుడు అతడిని రనౌట్ చేసే అవకాశం శాంసన్‌కు లభించింది. 12వ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పాయింట్‌లో ఉన్న హెట్‌మెయర్ బంతిని ఆపి కీపర్ వైపు విసిరాడు. అప్పటికి అభిషేక్ క్రీజు అవతలే ఉన్నాడు. అయితే కీపర్ సంజూ శాంసన్ బంతి రాకముందే గ్లౌజ్‌తో వికెట్లను పడగొట్టేశాడు. దీంతో ఆ అవకాశం పోయింది.

Kohli vs Ganguly: చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

హెట్‌‌మెయిర్ బౌలింగ్‌లో మరోసారి సంజూ స్టంపింగ్ ఛాన్స్ మిస్ చేశాడు. బంతిని పట్టుకోలేక ఖాళీ చేతులతో స్టంప్ చేశాడు. అప్పటికి రాహుల్ క్రీజు బయట ఉన్నాడు. అయితే బంతిని సంజూ అందుకోలేకపోవడంతో మరో అవుట్ మిస్ అయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ టీమ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated Date - 2023-05-08T09:53:58+05:30 IST