Shikhar Dhawan 99: మరపురాని ఇన్నింగ్స్ ఆడిన ధవన్.. ఒక్కడు 99 కొడితే మిగతా అందరూ కలిసి 38 పరుగులు..

ABN , First Publish Date - 2023-04-10T09:41:14+05:30 IST

ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచిన హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు సొంతగడ్డపై జూలు విదిల్చింది.

Shikhar Dhawan 99: మరపురాని ఇన్నింగ్స్ ఆడిన ధవన్.. ఒక్కడు 99 కొడితే మిగతా అందరూ కలిసి 38 పరుగులు..

ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఈ ఐపీఎల్‌లో (IPL 2023) తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచిన హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు సొంతగడ్డపై జూలు విదిల్చింది. పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై (PBKS) హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ ఓడిపోయిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు.

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో (PBKSvsSRH) టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే ధవన్‌ మాత్రం అసాధారణ ఆటను ప్రదర్శించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయాడు. 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ స్కోరు మొత్తం 143 కాగా, అందులో 99 పరుగులు ధవన్ చేసినవే. ఆరు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో లభించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ కలిసి కేవలం 38 పరుగులు మాత్రమే చేశారు. చివరి బ్యాట్స్‌మెన్ రతీ‌తో కలిసి ధవన్ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అందులో రతీ చేసింది కేవలం 1 పరుగు మాత్రమే.

Rinku Singh: ఇదెక్కడి బ్యాటింగ్‌రా బాబోయ్.. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో

తను ఇచ్చిన మూడు క్యాచ్‌లను భువనేశ్వర్‌ వదిలేయడం కూడా ధవన్‌కు కలిసొచ్చింది. మిగతా వారు ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఓ దశలో పంజాబ్ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. అయితే బౌలర్లను పెట్టుకుని ధవన్ అసాధారణంగా పోరాడాడు. జట్టు స్కోరును 143కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ టీమ్ సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

Updated Date - 2023-04-10T09:41:14+05:30 IST