Hardik Pandya: గిల్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు.. రషీద్ మా జట్టుకు అత్యంత కీలకం..!
ABN , First Publish Date - 2023-05-27T13:19:06+05:30 IST
ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీలు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గిల్ బౌండరీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ (GT) యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)పై మాజీలు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (GTvsMI) గిల్ బౌండరీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఆడిన గిల్ 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 111 పరుగులు బౌండరీల రూపంలో వచ్చినవే.
గిల్ సూపర్ ఫామ్ గురించి అతడి జట్టు నాయకుడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. గిల్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ``నేను చూసిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమమైనది. గిల్ ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. అతడు కొన్నేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఏలతాడు. అతడిలో ఎక్కడా హడావిడి కనిపించదు. చాలా కూల్‌గా విధ్వంసం సృష్టిస్తాడు. అతడు భవిష్యత్తు సూపర్ స్టార్. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే గుజరాత్‌కు, టీమిండియాకు చాలా మేలు జరుగుతుంది.
Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. గిల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆ టైటిల్ మాదే.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక, మా జట్టులో మరో తురుపు ముక్క రషీద్ ఖాన్ (Rashid Khan). జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అతడి పైనే ఆధారపడతా. అతడు ఎప్పుడూ నిరాశపరచలేదు. ఇక, ఫైనల్లో మేము అత్యంత క్లిష్టమైన చెన్నై టీమ్‌ను (CSKvsGT) ఎదుర్కోబోతున్నాం. వంద శాతం ఎఫర్ట్ పెడితేనే మేం టైటిల్ సాధించగలం. ఫైనల్ మ్యాచ్ (IPL 2023 Final Match) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామ``ని పాండ్యా అన్నాడు.