Kohli vs Ganguly: గంగూలీ వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయిన కోహ్లీ.. చేయి కలిపేందుకు నిరాకరించిన దాదా!

ABN , First Publish Date - 2023-04-16T08:15:38+05:30 IST

``కింగ్`` కోహ్లీ విరాట్ మైదానంలోనూ, వెలుపలా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. భావోద్వేగాలను దాచుకోకుండా ప్రదర్శిస్తుంటాడు. ఆ క్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లతో కూడా కోహ్లీ పలు సందర్భాల్లో గొడవలకు దిగాడు.

Kohli vs Ganguly: గంగూలీ వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయిన కోహ్లీ.. చేయి కలిపేందుకు నిరాకరించిన దాదా!

``కింగ్`` కోహ్లీ (Virat Kohli) విరాట్ మైదానంలోనూ, వెలుపలా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. భావోద్వేగాలను దాచుకోకుండా ప్రదర్శిస్తుంటాడు. ఆ క్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లతో కూడా కోహ్లీ పలు సందర్భాల్లో గొడవలకు దిగాడు. టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన అనీల్ కుంబ్లేతో (Anil Kumble) కెప్టెన్ అయిన కోహ్లీ ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించింది. అలాగే సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతడితో కూడా కోహ్లీ గొడవ పెట్టుకున్నాడు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు మీడియా ముఖంగానే దాడి చేసుకున్నారు.

వారి మధ్య ఉన్న విభేదాలు తాజాగా మరోసారి బయటపడ్డాయి. మ్యాచ్ (DCvsRCB) అనంతరం ఇరు టీమ్‌లకు సంబంధించిన సిబ్బంది, ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు లైన్‌లో నిల్చున్నారు. ఢిల్లీ టీమ్ డైరెక్టర్ అయిన గంగూలీ కూడా మైదానంలోకి వచ్చాడు. అయితే కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేక అతడు పాంటింగ్‌ను తప్పించుకుని ముందుకు వెళ్లిపోయి మిగిలిన ఆటగాళ్లతో కరచాలనం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Ganguly refuses to shake hands with Virat).


అలాగే తమ జట్టు ఓటమి అంచుల్లోకి చేరుకోవడంతో డగౌట్‌లో గంగూలీ విచారంగా కూర్చుని ఉండగా అతడి వైపు కోహ్లీ కోపంగా చూస్తూ నడుచుకుని ముందుకు వెళ్లడం కనిపిస్తోంది. ఇక, ఎప్పుడూ లేనిది ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీని కోహ్లీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అర్ధ శతకం తర్వాత డగౌట్ వైపు చూస్తూ గాల్లోకి పంచ్‌లు విసరడం గంగూలీని టీజ్ చేయడానికే అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-04-16T08:15:38+05:30 IST