DC vs SRH: 9పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు

ABN , First Publish Date - 2023-04-30T00:26:11+05:30 IST

వరుస ఓటములతో సతమతమవుతన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు ఊరట లభించింది. .

DC vs SRH: 9పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు

వరుస ఓటములతో సతమతమవుతన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో 9పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) విజయం సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమతమైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) నిర్దేశించిన 198 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేసింది. మార్ష్ 63 పరుగులు, ఫిల్ సాల్ట్ 59 హాఫ్ సెంచరీలతో రాణించినా.. మిగతా బ్యాటర్లు చెప్పకోదగ్గ పరుగులు చేయకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓటమి తప్పలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ 2, భువనేశ్వర్, అకీలా, నటరాజన్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 67 పరుగులు, హెన్రీచ్ క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అబ్దుల్ సమ్ 28 పరుగులు చేయగా ..మయాంక్ (5), త్రిపాఠి (10), మార్ క్రమ్(8), బ్రూక్ డకౌట్ అయ్యారు. అయితే మ్యాచ్ చివర్లో అఖిల్ హోస్సేన్ 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 16 పరుగులతో ఓ మెరుపు మెరిశాడు. ‌కాగా ఢిల్లీ బౌలర్లలో మిచెల్ 4 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

Updated Date - 2023-04-30T00:26:11+05:30 IST