SRHvsRR: ఉప్పల్ స్టేడియంలో SRH ఓడితే ఓడింది గానీ ఈ వీడియో మాత్రం హైలైట్ అసలు..!
ABN , First Publish Date - 2023-04-03T08:38:23+05:30 IST
సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. గత రెండు సీజన్లలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్ ఈ సీజన్‌ను కూడా చెత్తగానే ప్రారంభించింది. అయితే ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆనందించాల్సిన విషయం ఏమైనా ఉందా అంటే అది బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) గురించే.
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు. భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత వచ్చిన దేవదూత్ పడిక్కల్‌ను ( Devdutt Padikkal) అద్బుతమైన ఫాస్ట్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. వికెట్ ఎగిరి దూరంగా పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. జమ్మూ, కశ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ వేగం చాలా మందిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌కు ప్రధాన బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉమ్రాన్‌కు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
IPL 2023: కోట్లు పోసి కొంటే ఇలానా ఆడేది.. అట్టర్‌ప్లాప్ అయిన ఈ ముగ్గురినీ ఎంతకు కొన్నారో గుర్తుందా..?
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ రాజస్థాన్ టీమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని విభాగాల్లోనూ రాణించి హైదరాబాద్‌ను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 203 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు.