Virat Kohli: జాస్ బట్లర్ అవుటయ్యాక కోహ్లీ రియాక్షన్ చూశారా? నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2023-04-24T09:14:05+05:30 IST
``కింగ్`` కోహ్లీ ఆట విషయంలోనే కాదు.. మైదానంలో ప్రవర్తన విషయంలోనూ కాస్త దూకుడుగానే ఉంటాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసి అతడి మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంటుంది.
``కింగ్`` కోహ్లీ (Virat Kohli) ఆట విషయంలోనే కాదు.. మైదానంలో ప్రవర్తన విషయంలోనూ కాస్త దూకుడుగానే ఉంటాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసి అతడి మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ అవుటైనపుడు కోహ్లీ చేసుకునే సంబరాలు కాస్త అతి అనిపిస్తుంటాయి. ఇక, తనే కెప్టెన్‌గా ఉన్నప్పుడైతే కోహ్లీ సెలబ్రేషన్ మరింత పై లెవెల్‌లో ఉంటుంది. ఆదివారం సాయంత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది (RCBvsRR).
కెప్టెన్ డుప్లెసీ (Faf du Plessis) గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. డుప్లెసీ లేకపోవడంతో ఆర్సీబీకి కోహ్లీ నాయకత్వం వహించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. కోహ్లీ డకౌట్ అయినా.. ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) (44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77), డుప్లెసి (39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) ధనాధన్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. దీంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.
Ajinkya Rahane: సూపర్ ఫామ్‌లో రహానే.. ఇక, సెలక్టర్లకు మరో దారి లేదు.. ఏ నిర్ణయం తీసుకుంటారో..!
అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే ప్రమాదకర జాస్ బట్లర్ (Jos Buttler) వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌లో బట్లర్ బౌల్డ్ అయ్యాడు. ప్రమాదకర బౌల్ట్ అవుట్ కావడంతో కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అవుటై వెళ్లిపోతున్న బట్లర్‌ను వెక్కిరిస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ రియాక్షన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ``తన లాగానే డకౌట్ అయిన బట్లర్‌ను చేసి కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు``, ``మరీ అంత ఓవరాక్షన్ ఎందుకు``, ``బట్లర్ అంటే అంత భయమా`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.