Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ అరుదైన రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించిన కోహ్లీ!
ABN , First Publish Date - 2023-04-11T11:56:40+05:30 IST
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సాధించాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న ``కింగ్`` కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌లో (IPL 2023) అరుదైన ఘనతను సాధించాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న ``కింగ్`` కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. తాజాగా ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకున్నాడు. సోమవారం లఖ్‌నవూతో (LSG) జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న అన్ని టీమ్‌లపై అర్ధశతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు (50-plus scores on all teams).
ఐపీఎల్‌లో ఆడుతున్న 8 టీమ్‌లపై హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. తాజాగా లఖ్‌నవూపై (LSGvsRCB) కూడా అర్ధశతకం సాధించాడు. లఖ్‌నవూ టీమ్‌పై కోహ్లీకిదే తొలి హాఫ్ సెంచరీ. అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై కోహ్లీ 9 అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి కోహ్లీ బెంగళూరు తరఫునే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించలేదు.
IPL 2023: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి.. ఫ్యాన్స్ కన్నీళ్లు.. స్టేడియంలో ఫుల్ ఎమోషన్స్!
ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది 46వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అలాగే బెంళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకి ఇది 24వ అర్ధశతకం. ఇదే మైదానంలో కోహ్లీ మూడు సెంచరీలు కూడా చేశాడు. ఈ మైదానంలో కోహ్లీకి ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి.