Virat Kohli: విరాట్ కోహ్లీలో సరికొత్త కోణం.. ఢిల్లీలో చిన్న నాటి కోచ్ కాళ్లు మొక్కిన కోహ్లీ!
ABN , First Publish Date - 2023-05-07T08:53:41+05:30 IST
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే `కింగ్` కోహ్లీలో మరో కోణం కూడా ఉంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే కింగ్
కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. ఆత్మీయులతోనూ, స్నేహితులతోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) టీమ్ తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ (DCvsRCB)జరిగింది.
మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ వేగంగా మైదానంలోకి నడుచుకుంటూ వచ్చాడు. స్టేడియంలో ఉన్న తన చిన్న నాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దగ్గరకు వెళ్లాడు. ముందుగా అతడి కాళ్లకు నమస్కారం చేశాడు (Virat Kohli Touched The Feet Of His Childhood Coach). అనంతరం ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. చిన్న నాటి కోచ్ ఆశీర్వాదాలు కోహ్లీకి బాగా పనిచేసినట్టు ఉన్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 42 బంతుల్లో అర్ధశతకం సాధించి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2023: వాళ్లిద్దరినీ తీసేస్తేనే జట్టుకు మంచిది.. యువ ఆటగాళ్లపై రాజస్థాన్ అభిమానులు ఫైర్!
తన చిన్ననాటి కోచ్‌కు కోహ్లీ దండం పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. కోహ్లీకి ఎక్కడ తగ్గాలో తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ టీమ్ విజయం సాధించింది. 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. ఫిల్ సాల్ట్ (Philip Salt) (87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.