IPL 2023: జియో సినిమాలో భోజ్‌పురి కామెంట్రీ సూపర్ హిట్.. కోహ్లీ ఎంతలా నవ్వుతున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-04-18T14:46:15+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆదరిస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనను అస్వాదిస్తున్నారు. ``జియో సినిమా`` ఈ ఐపీఎల్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది.

IPL 2023: జియో సినిమాలో భోజ్‌పురి కామెంట్రీ సూపర్ హిట్.. కోహ్లీ ఎంతలా నవ్వుతున్నాడో చూడండి..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ను (IPL 2023) ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆదరిస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనను అస్వాదిస్తున్నారు. ``జియో సినిమా`` (Jio Cinema) ఈ ఐపీఎల్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. రోజుకు కొన్ని కోట్ల మంది ``జియో సినిమా`` ద్వారా ఐపీఎల్‌ను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, తెలుగుతో పాటు భోజ్‌పురిలో (Bhojpuri Commentary) కూడా కామెంట్రీ చెప్పిస్తూ ఆయా భాషల ప్రజలకు చేరువయ్యేందుకు ``జియో సినిమా`` ప్రయత్నిస్తోంది.

మిగతా భాషల సంగతి పక్కన పెడితే భోజ్‌పురి భాషలో చెప్పే కామెంట్రీ సూపర్ హిట్ అయింది. భోజ్‌పురి యాసతో అక్కడి వారు అద్భుతంగా కామెంట్రీ చెబుతున్న ఐపీఎల్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ (Virat Kohli) తను ఆడిన మ్యాచ్ రీప్లేను భోజ్‌పురి కామెంట్రీతో వీక్షించాడు. తను కొట్టిన షాట్లు గురించి వివరిస్తూ భోజ్‌పురి కామెంటేటర్లు చేసిన వ్యాఖ్యానం కోహ్లీకి విపరీతంగా నచ్చింది. భోజ్‌పురి కామెంటేటరి చాలా వినోదభరితంగా ఉందని కోహ్లీ కామెంట్ చేశాడు.

Ajinkya Rahane: రహానే సిక్స్ కొడితే.. స్టేడియం పైకప్పుపై పడిన బంతి.. వీడియో వైరల్!

పలు తెలుగు సినిమాల్లో నటించిన నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ (Ravi Kishan) ఐపీఎల్ కోసం భోజ్‌పురిలో కామెంటరీ చెబుతున్నారు. ఆయనతో పాటు మహ్మద్ సైఫ్, సత్య ప్రకాశ్ తదితర స్థానిక క్రికెటర్లు అద్భుతంగా కామెంటరీ చేస్తున్నారు. మిగతా స్థానిక భాషలతో పోల్చుకుంటే భోజ్‌పురి స్ట్రీమింగ్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోందట.

Updated Date - 2023-04-18T14:46:15+05:30 IST