Virat Kohli: ఆర్సీబీ విజయంతో కోహ్లీ ఉత్సాహం.. భార్య అనుష్కకు ఫ్లయింగ్ కిసెస్..!
ABN , First Publish Date - 2023-04-24T11:52:58+05:30 IST
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ 7 పరుగుల తేడాతో ఓడించింది.
ఐపీఎల్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ 7 పరుగుల తేడాతో ఓడించింది (RCBvsRR). ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ చాలా చురుగ్గా, ఉత్సాహంగా జట్టును ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఒక్కో వికెట్ కోల్పోతున్నప్పుడు కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ముఖ్యంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో హార్షల్ పటేల్ వేసిన నాలుగో బంతిని జైశ్వాల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లీ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. మంచి టచ్‌లో కనిపించిన జైశ్వాల్ అవుట్ కావడంతో కోహ్లీ సంతోషం పట్టలేకపోయాడు. ఆ క్యాచ్ అనంతరం కోహ్లీ తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma) వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి (Kohli’s flying kiss to Anushka).
MS Dhoni: నా ఫేర్‌వెల్ కోసం వచ్చారేమో.. ఈడెన్ గార్డెన్స్‌లో అభిమాన సంద్రంపై ధోనీ సరదా వ్యాఖ్యలు..
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 182/6 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (47), దేవ్‌దత్ పడిక్కళ్ (34 52) రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు నెలకొల్పారు. అయితే, మధ్య ఓవర్లలో ఆశించిన వేగంతో పరుగులు చేయలేక పోవడంతో కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. దీంతో ఒత్తిడిలో పడి వికెట్లు కోల్పోయారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసి బదులు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.