Sehwag: అంత చెత్తగా ఆడితే ఎలా? వాళ్లను చూసి నేర్చుకో అంటూ యువ ఆటగాడిపై సెహ్వాగ్ విమర్శలు!

ABN , First Publish Date - 2023-04-05T13:00:27+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.

Sehwag: అంత చెత్తగా ఆడితే ఎలా? వాళ్లను చూసి నేర్చుకో అంటూ యువ ఆటగాడిపై సెహ్వాగ్ విమర్శలు!

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) యువ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. ఈ ఐపీఎల్‌‌లో (IPL 2023) లక్నోతో (LSG) జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మంగళవారం గుజరాత్‌తో (GTvsDC)జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులే చేసి ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ షాట్ సెలక్షన్ బాగా లేకపోవడం వల్లే పృథ్వీ అవుటయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.

పృథ్వీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ ఆడిన శుభమన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. మరోవైపు చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా సత్తా చాటుతున్నాడు. అయితే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని మాజీల ప్రశంసలు అందుకున్న పృథ్వీ మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పృథ్వీ షాట్ సెలక్షన్ చాలా చెత్తగా ఉందని అన్నాడు.

Axar Patel’s Six: పంత్ ఎదురుగా అతడి స్టైల్‌లోనే సిక్స్ కొట్టిన అక్షర్ పటేల్.. సింగిల్ హ్యాండ్‌తో భారీ షాట్!

``చెత్త షాట్ సెలక్షన్‌తో పృథ్వీ ఇప్పటికే ఎన్నోసార్లు వికెట్లు సమర్పించుకున్నాడు. అయినా తన తప్పుల నుంచి అతడు గుణపాఠం నేర్చుకోవడం లేదు. శుభ్‌మన్ గిల్, గైక్వాడ్‌లను చూడండి. రోజురోజుకూ వారు మరింత ఉన్నతంగా ఆడుతున్నారు. వారిని చూసి పృథ్వీ నేర్చుకోవాల``ని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2023-04-05T13:00:27+05:30 IST