Sanju Samson Cheating: రోహిత్ శర్మ నాటౌట్.. సంజూ శాంసన్ చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!
ABN , First Publish Date - 2023-05-01T14:08:32+05:30 IST
ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఆ మ్యాచ్ ఐపీఎల్‌లో 1000వ మ్యాచ్ కావడం ఒక విశేషమైతే.. రోహిత్ శర్మ 36వ పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం.
ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ (RRvsMI) చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఆ మ్యాచ్ ఐపీఎల్‌లో 1000వ మ్యాచ్ కావడం ఒక విశేషమైతే.. రోహిత్ శర్మ (Rohit Sharma) 36వ పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం. బర్త్ డే రోజు ముంబై కెప్టెన్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తుందని అందరూ ఆశించారు. భారీ ఛేదనలో హిట్ మ్యాన్ చెలరేగుతాడని అందరూ ఊహించారు. అయితే కేవలం 3 పరుగులకే రోహిత్ పెవిలియన్ చేరాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే సందీప్ శర్మ (Sandeep Sharma) బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే అది ఔట్ కాదని అభిమానులు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఛీటింగ్ చేసి రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడని ఆరోపణలు చేస్తున్నారు. అంపైర్‌ను కూడా నిందిస్తున్నారు. సందీప్ శర్మ వేసిన బాల్ వికెట్ల పక్క నుంచి వెళ్లింది. అయితే ఆ బాల్ పట్టుకునే క్రమంలో కీపర్ సంజూ శాంసన్ వేలు వికెట్లకు తగలడంతో బెయిల్స్ కింద పడ్డాయి. దీంతో రాజస్థాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ రికార్డ్ సెంచరీ.. ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్!
రోహిత్ శర్మ కూడా తాను అవుట్ అని అనుకున్నాడు. బాల్ వికెట్లను దాటి వెళ్లుతున్న సమయంలోనే బెయిల్స్‌లోని ఎల్‌ఈడీ లైట్లు వెలగడంతో వికెట్లకు బాల్ తగిలిందని అందరూ అనుకున్నారు. దీంతో ఫీల్డ్ అంపైర్ కూడా చెక్ చేసుకోకుండా ఔట్ అని ప్రకటించారు. కానీ, ఆ వీడియో ఒకసారి పరిశీలిస్తే బంతి అసలు వికెట్లకు తగలే లేదని స్పష్టమవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.