IPL 2023: ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్సీబీని భయపెట్టిన ఈ కొత్త కుర్రాడు ఎవరు?.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టావ్ కదయ్యా!
ABN , First Publish Date - 2023-04-07T13:55:54+05:30 IST
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఒక్క ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయే అవకాశం ఆటగాళ్లకు ఐపీఎల్ కల్పిస్తోంది.
ఐపీఎల్ (IPL 2023) ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఒక్క ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయే అవకాశం ఆటగాళ్లకు ఐపీఎల్ కల్పిస్తోంది. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సిరాజ్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఈ సీజన్‌లో ఇప్పటికే తిలక్ వర్మ (Tilak Varma), సాయిసుదర్శన్ (Sai Sudarshan) వంటి ఆటగాళ్లు తమ ఆటతీరుతో మాజీల ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా కోల్‌కతాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ స్పిన్నర్ సుయాష్ శర్మ (Suyash Sharma) అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో ఢిల్లీ కుర్రాడు, 19 ఏళ్ల సుయాష్ శర్మను కేకేఆర్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సుయాష్ ``ఇంపాక్ట్ ప్లేయర్``గా (Impact Player) బరిలోకి దిగాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
Virat Kohli: ఈడెన్‌లో ``కింగ్స్`` సందడి.. కోహ్లీ చేత డ్యాన్స్ వేయించిన షారుక్.. వైరల్ అవుతున్న వీడియో!
నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తన మిస్టరీ స్పిన్‌తో దినేష్ కార్తీక్, అనూజ్, విల్లేలను అవుట్ చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం సుయాష్ బౌలింగ్ యాక్షన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుయాష్ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా ప్రశంసలు కురిపించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సుయాష్ అద్భుతంగా వినియోగించుకున్నాడని తెలిపాడు.