IPL 2023: 5 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ తల్లి అన్నం తినలేదట, రాత్రంతా ఏడుస్తూనే ఉందట..!

ABN , First Publish Date - 2023-04-12T13:48:11+05:30 IST

కొన్ని రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

IPL 2023: 5 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ తల్లి అన్నం తినలేదట, రాత్రంతా ఏడుస్తూనే ఉందట..!

కొన్ని రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు. విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh), గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ (Yash Dayal) వేసిన చివరి ఓవర్లో 5 బంతులకు 5 సిక్స్‌లు కొట్టాడు (5 Sixes in 5 balls). ఈ ప్రదర్శనతో రింకూ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే ఆ ఓవర్ వేసిన యశ్ మాత్రం తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. యశ్ మాత్రమే కాదు.. అతడి తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక వ్యథ అనుభవించారు.

తాజాగా ఆ విషయాన్ని యశ్ దయాల్ తండ్రి చంద్రపాల్ వెల్లడించారు. ముఖ్యంగా యశ్ తల్లి (Yash Dayal's mother) రాధను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదట. కెరీర్ ఆరంభంలోనే తన కొడుక్కి అలాంటి చేదు అనుభవం ఎదురవడాన్ని ఆమె సహించలేకపోతోందట. మ్యాచ్ గడిచి మూడు రోజులు పూర్తవుతున్నా ఆమె ఆ బాధ నుంచి తేరుకోలేకపోతోందట. అప్పట్నుంచి అన్నం తినలేదట. ఏడుస్తూనే ఉండిపోతోందట. కుటుంబ సభ్యులందరూ ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా ఆమె మాత్రం సాధారణ మనిషి కాలేకపోతోందట.

Rohit Sharma: చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ.. మ్యాచ్ గెలిచాక భార్యకు వీడియో కాల్ చేసి..

``నిజంగా అది మాకో కాళరాత్రి. మా జీవితంలో ఎప్పటికీ మరువలేం. క్రికెట్‌లో ఇలాంటివి సాధారణమే. కానీ, మనవరకు వస్తే మాత్రం తట్టుకోలేం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఇతర ఆటగాళ్లు యశ్‌కు ధైర్యం చెప్పారు. యశ్ మూడ్ మార్చడానికి గుజరాత్ యాజమాన్యం చాలా ప్రయత్నాలు చేసింద``ని చంద్రపాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T13:48:11+05:30 IST