Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ రికార్డ్ సెంచరీ.. ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్!

ABN , First Publish Date - 2023-05-01T13:50:42+05:30 IST

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. తనకే సాధ్యమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ రికార్డ్ సెంచరీ.. ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్!

రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. తనకే సాధ్యమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో (MI) జరిగిన మ్యాచ్‌లో తొలి సెంచరీ (Yashasvi Jaiswal Century)సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్ ఓడిపోయినా జైస్వాల్ మాత్రం అందరి మనసులూ గెలుచుకున్నాడు. ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు దక్కించుకున్నాడు.

62 బంతుల్లో 124 పరుగులు చేసిన జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా ఉన్న జోస్ బట్లర్‌ (Jos Buttler) రికార్డును సమం చేశాడు. 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ కూడా 124 పరుగులు చేశాడు. ఇక, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ (అంతర్జాతీయ టీమ్‌కు ఆడని ఆటగాడు)గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు వాల్తాటి (120) పేరిట ఉండేది. పంజాబ్ తరఫున ఆడిన వాల్తాటీ చెన్నై టీమ్‌పై 120 పరుగులు చేశాడు.

MIvsRR: 1000వ మ్యాచ్‌లో ముంబై రికార్డు విజయం.. ప్రేక్షకులకు అసలు సిసలు మజా అందించిన మ్యాచ్!

ఇక, ఐపీఎల్‌లో చిన్న వయసులోనే సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో మనీష్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో రిషభ్ పంత్ (20 ఏళ్ల 218 రోజులు), దేవదత్ పడిక్కళ్ (20 ఏళ్ల 289 రోజులు) ఉన్నారు.

Updated Date - 2023-05-01T14:08:55+05:30 IST