Search Engines: మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా?

ABN , First Publish Date - 2023-03-21T18:19:16+05:30 IST

ఏఐ సెర్చ్ ఇంజన్స్‌‌ వస్తే మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా..

Search Engines: మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా?

ఏఐ సెర్చింజన్స్ (AI Search Engines) వచ్చిన తర్వాత... ఇక మామూలు సెర్చింజన్స్ పని అయిపోయినట్టేనని కొందరు భావిస్తున్నారు. అయితే నేరుగా ఏదో ఒక్క సమాధానం మాత్రమే పొందడం కోసమైతే ఏఐ సెర్చింజన్ ఓకే గానీ... నిజంగానే అనేక రకాల ఆన్సర్స్... అనేక రకాల సమాచార కోణాలు పరిచయం చేసుకోవాలంటే మాత్రం ఇప్పటికీ రెగ్యులర్ సెర్చ్ ఇంజన్స్ మీదే ఆధారపడక తప్పదంటున్నారు నిపుణులు.

ఏఐ సెర్చింజన్‌తో వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసా?... దానికి ఎక్కువగా తెలియకపోయినా దాన్ని నమ్మకంగా చెప్పేస్తుందట. ఎస్... అందువల్లే ఏఐ సెర్చింజన్లు పూర్తిగా ఆధారపడదగినవి కావని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకి మనం ఒక సెర్చ్ ఇంజన్లో ఒక విషయాన్ని అడిగినప్పుడు... అది అనేక రిజల్ట్స్ ఇస్తే... అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎందులో విశ్వసనీయత ఉందనిపిస్తే దాన్ని ఫాలో అవుతాం. కానీ ఏఐ చాట్‌లో అలాంటి వెసులుబాటు ఉండదు. ఏఐ చాట్ బాట్ (AI Chatbot) తనకి తెలిసున్న దాన్ని అదే కరెక్ట్ అన్నట్టుగా చెప్పేస్తుంది. మనిషితో మాట్లాడే ఒక న్యాచురల్ లాంగ్వేజ్ (Natural Language) విధానంలో అది జవాబులు చెప్పడం వల్ల... చెబుతోంది. మామూలు సెర్చ్ ఇంజన్ మాదిరిగా ఏదో రిజల్ట్స్ ఇచ్చి ఊరుకోవడం కాకుండా... ఇలా మనిషి చెప్పినట్టు చెప్పడం వల్ల విశ్వసనీయత ఎక్కువగా కలుగుతుందని... అందువల్ల మనం అది అబద్ధాలు చెప్పినా... నిజమే అన్నట్టుగా నమ్మేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి, ఏఐ ఇంజిన్ ఏది చెప్పినా ప్యాక్ట్ చెకింగ్ (Fact Check) అన్నది చాలా ముఖ్యం అని అంటున్నారు.

2.jpgఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐ సెర్చ్ ఇంజన్స్‌లో హెలూసినేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే, ఎఐ చాట్ బాట్ తనకి ఉన్న పరిమితుల్లో తనకి తెలిసిన సమాచారంలోంచి ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు... అదే సర్వస్వం అనుకుని దాన్నే రిపీట్ చేస్తూ ఉంటుంది. దీన్నే హెలూసినేషన్ (Hallucination) అంటారు. ఎందుకంటే, బయట సమాచారం నిజంగా అది కాకపోయి ఉండొచ్చు... అయినప్పటికీ తనకు తెలిసిందే నిజమని ఒక నూతిలో కప్ప మాదిరిగా అనుకుంటుంది. ఎందుకంటే, దానికి ఇచ్చిన రిసోర్స్ అవి మాత్రమే కాబట్టి... ఉదాహరణకి ఒక కంపెనీ ఆదాయం ఇన్ని వందల కోట్లు అని మనం ఇచ్చేమనుకోండి. ఇక ఎక్కడ ఆ సందర్భం వచ్చినా దాన్నే వాడుతుంటుంది. ఈ లోపు ఆ కంపెనీ ఆదాయం పెరగొచ్చు, పడుకోవచ్చు. అవన్నీ ఆ చాట్ బాట్‌కి తెలియవు. అందువల్ల ఒక భ్రమలో ఉంటూ ఆన్సర్ ఇస్తుంది. ఈ హలోసినేషన్స్‌ని, తప్పుల్ని కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు ఏ చాట్ బాట్స్‌లో తీసుకుంటున్న జాగ్రత్త ఏంటంటే... రిసోర్సుల్ని బాగా లిమిట్ చేసి, కొన్ని రిలైబుల్ రిసోర్సులను మాత్రమే దానికి అందించడం. ఎందుకంటే రిసోర్సులు ఎక్కువైనా కూడా ఏఐ చాట్ బాట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే విషయం ఒకచోట ఒకలా... ఒకచోట మరోలా ఉంటే ఏఐ ఇంజిన్ కన్ఫ్యూషన్‌కి గురవుతుంది. అందువల్ల కేవలం కొన్ని రిసోర్సుల్ని మాత్రమే వాటికి అందిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే... చాట్ బాక్స్ నాలెడ్జ్ చాలా పరిమితంగా ఉంటుందని... దానికి తెలిసున్న సర్కిల్‌లోనే అది ఆలోచించగలదు. అదే మామూలు సెర్చింజన్ అయితే ఆ సమస్యకి ఇతర కోణాలు, అదనపు సమాచారం అన్నింటిని ఇవ్వగలుగుతాయి.

1.jpgఏదేమైనా ఇప్పుడు కొన్ని కొత్త తరం ఏఐ చాట్ బాట్స్‌లో ప్రాబబిలిటీ బూస్టర్ ఒక టూల్‌ని అదనంగా చేరుస్తున్నారు. ఏఐ చాట్ బాట్ చెప్పే విషయాలు వీలైనంతవరకు సత్యానికి దగ్గరగా ఉండేలాగా ఈ ప్రాబబిలిటీ బూస్టర్ చెక్ చేస్తుంది. అంతే కాదు మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు... ఏఐ చాట్ బాట్ ఏ సమాధానాలు ఇచ్చిందో.... ఆ సమాధానాన్ని ఏ రిసోర్సుల ఆధారంగా ఇచ్చిందన్నది కూడా అక్కడ తెలియజేస్తారు. దానివల్ల మనం రిసోర్సెస్‌లోకి వెళ్లి.... ఏది నిజం అన్నది చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక మనిషి మాదిరిగా... ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏఐ చాట్ బాట్ కరాకండిగా ఆన్సర్ ఇచ్చేసినప్పటికీ... దాని విశ్వసనీయతని అనుమానించాల్సిందే అంటున్నారు. ఏఐ చాట్ బాట్స్ మీద పూర్తిగా ఆధారపడిపోవచ్చనుకునే వాళ్లందరూ ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2023-03-21T18:19:16+05:30 IST