Gmail Account: ఇలాంటి గూగుల్ అకౌంట్లు డిలీట్ చేస్తాం.. గూగుల్ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-08-20T19:00:22+05:30 IST

జీమెయిల్ అకౌంట్ల భద్రత, సమాచార గోప్యత కోసం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు యూజర్లను ఒక్కసారి కూడా ఉపయోగించని గూగుల్ అకౌంట్లను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది.

Gmail Account: ఇలాంటి గూగుల్ అకౌంట్లు డిలీట్ చేస్తాం.. గూగుల్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: జీమెయిల్ అకౌంట్ల భద్రత, సమాచార గోప్యత కోసం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు యూజర్లను ఒక్కసారి కూడా ఉపయోగించని గూగుల్ అకౌంట్లను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది. అయితే, గతంలో 18 నెలలుగా ఉన్న ఈ కాలపరిమితిని తాజాగా రెండేళ్లకు పెంచింది. యూజర్లు వినియోగించని అకౌంట్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని గూగుల్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను నివారించేందుకు అకౌంట్లు తొలగించే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది(Google to Delete Inactive Accounts). గూగుల్ అకౌంట్ తొలగించిన సందర్భంలో అందులోని డాటా కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని స్పష్టం చేసింది. గూగుల్ అకౌంట్ రెండేళ్ల పాటు ఒక్కసారి కూడా వాడకపోయినా, లేదా ఈ అకౌంట్‌ను ఇతర సర్వీసులు పొందేందుకు వినియోగించకపోయినా డిలీషన్ తప్పదని స్పష్టం చేసింది.


అయితే, ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పిన గూగుల్ అకౌంట్ల తొలగింపు మాత్రం ఈ ఏడాది చివరి నుంచీ ప్రారంభిస్తామని చెప్పింది. ఓ అకౌంట్ డిలీట్ చేసే ముందు యూజర్‌కు, ఆ అకౌంట్‌ను అనుసంధానమైన ఉన్న రికవరీ ఈమెయిల్ అడ్రస్‌కు హెచ్చరికగా పలు ఈమెయిళ్లు పంపుతామని పేర్కొంది. ఇలా ఎనిమిది నెలల పాటు పంపుతామని అప్పటికీ ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే అకౌంట్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొంది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే యూజర్లు కనీసం రెండేళ్లకు ఒక్కసారైన తమ జీమెయిల్ అకౌంట్లలోకి సైన్ ఇన్ కావాలని సూచించింది.

Updated Date - 2023-08-20T19:01:13+05:30 IST