Duck Assist మీకు ఎలాంటి సాయం చేస్తుందంటే...
ABN , First Publish Date - 2023-03-21T17:56:51+05:30 IST
చాట్ జీపీటీ (Chat Gpt) వచ్చాక మామూలు సెర్చ్ కంటే ఏఐ సెర్చి (AI Search) మరింత పవర్‌ఫుల్ అనే విషయం ప్రపంచానికి అర్థం అయిపోయింది
చాట్ జీపీటీ (Chat Gpt) వచ్చాక మామూలు సెర్చ్ కంటే ఏఐ సెర్చి (AI Search) మరింత పవర్‌ఫుల్ అనే విషయం ప్రపంచానికి అర్థం అయిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతి సెర్చ్ ఇంజన్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చేర్చడానికి కంపెనీలు చూస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (Microsoft) తన బింగ్ సెర్చ్ ఇంజన్‌లో (Bing Search Engine) ఏఐని చేర్చింది. ఇప్పుడు తాజాగా పాపులర్ సెర్చ్ ఇంజన్ డక్ డక్ గో (Duck Duck Go) ఏఐ పవర్‌ని తనలో ఇముడ్చుకోబోతోంది.
కేవలం గూగుల్ సెర్చింజన్ (Google Search Engine) మాత్రమే వాడే వాళ్ళకి Duck Duck Go పేరుతో పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని, టెక్నో ప్రపంచంలో నిత్యం లక్షలాదిమంది ఎంతో నమ్మకంతో వాడే సెర్చ్ ఇంజన్ Duck Duck Go. గూగుల్‌లో మనం ఏం సెర్చ్ చేసినా అది రికార్డు అవుతుంది. మన ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కానీ Duck Duck Go అలా కాదు. వీళ్ళు మన ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యమిస్తారు. మనం సెర్చింజన్ ద్వారా ఏ సమాచారాన్ని వెదికాం... ఏమేం చూశామన్నది వీళ్ళు ట్రాక్ చేయరు, రికార్డ్ చేయరు. మన యూజర్ డేటాని ఎంతమాత్రం ఉపయోగించుకోరు. ఇలాంటి కారణాలవల్ల టెక్నో సర్కిల్స్‌లో Duck Duck Goకి ఎంతో క్రేజ్ ఉంది. చాలామంది గూగుల్ సెర్చింజన్‌ని పూర్తిగా పక్కన పెట్టేసి Duck Duck Go మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటారు.
ఇప్పుడు తాజాగా Duck Duck Go సెర్చ్ ఇంజన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చేర్చబోతున్నారు. గూగుల్, బింగ్ లాంటి రెగ్యులర్ సెర్చింజన్ వాడని వాళ్ళకి ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. మామూలు రెగ్యులర్ సెర్చింజన్‌తో బాటుగా దీంట్లో ఇప్పుడు Duck Assist అనే ఒక టూల్‌ని చేర్చబోతున్నారు. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే అసిస్టెంట్. Duck Duck Go సెర్చింజన్ వాడేవాళ్లు దీన్ని Duck Duck Go యాప్స్ ద్వారా పొందొచ్చు లేదా బ్రౌజర్ ఎక్స్టెన్షన్‌గా కూడా ఈ Duck Assistని install చేసుకోవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌ని తర్వాత ఏదైనా పెయిడ్ వెర్షన్‌గా మారుస్తారేమో గాని... బీటా వెర్షన్ వరకు మాత్రం ఇది పూర్తి ఉచితం. దీని వాడాలంటే మనం ఎకౌంట్‌తో లాగిన్ కూడా అవ్వాల్సిన పనిలేదు. ఈ Duck Duck Go సెర్చింజన్‌లో చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా టర్బో మోడల్ అనే ఒక మోడల్‌ని వీళ్ళు వాడబోతున్నారు. టర్బో మోడల్ ఏంటంటే... నేచురల్ లాంగ్వేజ్‌లో ఆన్సర్స్‌ని రూపొందించడం కోసం అనేక ఏఐ మోడల్స్‌ని వాడుతూ ఉంటారు. ఇందులో ప్రస్తుతం Chat GPTలో ఓపెన్ అయ్యే వాళ్ళు వాడుతున్న మోడల్ డావిన్సీ మోడల్... వాళ్ళది టర్బో మోడల్ అనే మరొక కొత్త విధానం కూడా ఉంది. Duck Duck Goలో దీన్ని వాడబోతున్నారు. అంటే, లాంగ్వేజ్ మరింత నేచురల్ గా ఉండే అవకాశం ఉంది.
Duck Duck Goలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఇందులో instant answers అనే ఒక ఫీచర్ ఉంది. మామూలుగా గూగుల్ సెర్చ్‌లో కూడా చూడండి... మనం ఒక ప్రశ్న అడగ్గానే పైన కొన్ని instant answers కింద సెర్చ్ రిజల్ట్స్‌తో పాటుగా పైన కొన్ని రెడీమేడ్ ఆన్సర్స్ మనకి సిద్ధంగా కనిపిస్తాయి. మనం అడిగిన ప్రశ్నకి సంబంధించిన బేసిక్ వివరాలను వికీపీడియా లాంటి వాటి నుంచి తీసుకుని instant answerగా చూపిస్తుంది Duck Duck Go. అయితే Duck Assist ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావడం వల్ల ఇంకా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు... ఈ ప్రశ్నకి వికీపీడియా నుంచి సమాధానం తీసుకోవచ్చా... అని ఆలోచిస్తుంది.
అంతేకాదు మన ఆన్సర్‌కి సంబంధించిన సమాచారం వికీపీడియాలో ఉంటే ఆ కంటెంట్ వెతికి పట్టి అక్కడ డిస్‌ప్లే చేస్తుంది. అది కూడా కాపీ చేసి... ఏదో గుడ్డిగా చూపించినట్టు కాకుండా మనం అడిగిన ప్రశ్నకి అనుగుణంగా ఒక సమాధానంగా దాన్ని మార్చి, మంచి నేచురల్ లాంగ్వేజ్‌లో అందిస్తుంది. అంటే ఇది కాపీ-పేస్ట్ కాదు. మళ్ళీ తిరిగి ఆన్సర్ రాస్తుందన్నమాట. అంటే రెడీమేడ్ కంటెంట్ చూపించడం కాకుండా... మనం అడిగిన ప్రశ్నను బట్టి... కరెక్ట్‌గా అప్పటికప్పుడు సమాధానం క్రియేట్ చేసి చూపించడం Duck Assist చేసే పని. అంతేకాదు అదే ప్రశ్నని గతంలో ఎవరైనా అడిగి ఉంటే... అప్పటికే దానికి సంబంధించిన సమాధానం రెడీగా ఉంటే... వెంటనే దాన్ని చూపించగలదు. ఈ విధంగా సెక్యూర్ సెర్చ్ ఇంజన్ అయిన Duck Duck Goని ఇంటెలిజెన్స్ మరింత పవర్‌ఫుల్‌గా తయారు చేయబోతోంది. అటు ప్రైవసీ కోరుకుంటూనే.... ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్‌ని కూడా కావాలని అనుకునేవాళ్ళు ఇక Duck Duck Go సెర్చింజన్‌ని ఆశ్రయించవచ్చు.