Telangana University: టీయూ పాలకమండలి భేటీ.. పలు తీర్మానాలు ఆమోదం
ABN , First Publish Date - 2023-06-03T17:48:04+05:30 IST
ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్, నాంపల్లిలోని రూసా కార్యాలయంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలక మండలి సమావేశమైంది.
హైదరాబాద్: ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్, నాంపల్లిలోని రూసా కార్యాలయంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలక మండలి సమావేశమైంది. వాకాటి కరుణ అధ్యక్షతన జరిగిన ఈసీ సమావేశం నిర్వహించారు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి (Registrar Yadagiri) ఉండగా.. కనకయ్య నియామకం చెల్లదని పాలకమండలి తీర్మానం చేసింది. 140 మంది డైలీవేజ్ ఉద్యోగులకు రూ.28 లక్షలు చెల్లింపులపై విచారణ జరిపించాలని పాలకమండలి తీర్మానం చేసింది. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ ఈసీ ఏక వాఖ్య తీర్మానం చేసింది. అంతేకాకుండా గత ఏడాది బడ్జెట్ 2022-23, ఈ ఏడాది 2023-24 సంవత్సర బడ్జెట్‌పై చర్చించి ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. వర్సిటీ పరిధిలోని మూడు క్యాంపస్‌లకు ఇటీవల ప్రిన్సిపాల్స్ మారడంతో ఈ ప్రతిపాదన పెట్టనున్నట్లు ఎజెండాలో పేర్కొన్నారు. పరిపాలన విభాగంలో పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్నందున వీటిని ఆమోదం తెలపాల్సి ఉంది. ముఖ్యంగా ఇటీవల పాలన విభాగంలో అధ్యాపకుల పదోన్నతులు, ఔట్ సోర్సింగ్‌లో పదోన్నలపై, నియామకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నూతన కోర్సులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.
టీయూ ఉద్యోగుల్లో టెన్షన్
ఈసీ అనుమతి పొందకుండా వీసీ ఒప్పదం మేరకు ఇటీవల యూనివర్సిటీలో పలు విభాగాల్లో కొందరు అధ్యా పకులు పదోన్నతులు అధికారులు కల్పించారు. అంతే గా కుండా సిబ్బంది నియామకాలపై ఉద్యోగుల్లో సర్వత్రా టెన్షన్ నెలకొంది ఈసీ సమావేశంలో ఉద్యోగాల పదోన్న తులపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకింత భయం నెలకొంది.