Share News

Amaravathi: దటీజ్ చంద్రబాబు.. మాట నిలబెట్టుకునే నైజం

ABN , Publish Date - Jun 13 , 2024 | 06:18 PM

ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు లేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు.

Amaravathi: దటీజ్ చంద్రబాబు.. మాట నిలబెట్టుకునే నైజం

ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు లేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు తన సంతకంతో అక్షరాల నిజం చేసి దటీజ్ నారా చంద్రబాబు నాయుడు అనిపించుకున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన తొలి ఐదు హామీలపై పంచభూతల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఆయన సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక ఫించన్ రూ.4 వేలకు పెంచుతూ అందుకు సంబంధించిన దస్త్రంపై మూడవ సంతకం పెట్టారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టి.. గత జగన్ పాలనలో ధ్వంసమైన ‘అన్నా క్యాంటీన్ల వ్యవస్థ’కు సంబంధించిన పునరుద్దరణ ఫైల్‌పై నాలుగో సంతకం చేశారు. అదే విధంగా యువత నైపుణ్య గణనపై కూటమి నేతలు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆ పైల్‌పై సైతం సీఎం చంద్రబాబు ఐదవ సంతకం చేశారు.


రాష్ట్రంలో గత అయిదేళ్లుగా జరిగిన జగన్నాటకంపై ప్రతిపక్షనేతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటమే చేశారు. బాదుడే బాదుడు, బాబు షూరిటీ భవిష్యతు గ్యారంటీ, ప్రజాగళం వగైరా వగైరా.. గత ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం ఏదైనా సరే.. ప్రజల మధ్యకు నారా చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లారు. అక్రమ మైనింగ్ అయినా.. జే బ్రాండ్ మద్యం అయినా.. గంజాయి అయినా.. డ్రగ్స్ అయినా... ఇలా ఏ అంశంపైన అయినా సరే.. విన్నారా తమ్ముళ్లు, చూశారా తమ్ముళ్లు అంటూ ఓ ఇంటిలోని పెద్దన్నలా జగన్ పాలనపైకి మేడిపండులా ఉన్న అందులోని అవినీతి గుట్టును చంద్రబాబు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా రట్టు చేసి మరి వివరించారు.

దీంతో కాలమే కాదు.. జనం కూడా కలిసి వచ్చారు. అందుకే తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం నల్లేరు మీద నడకే అయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కూటమి కొట్టిన దెబ్బకు గత అధికార పార్టీ.. ప్రస్తుతం ప్రతిపక్షానికి కూడా పరిమితం కానీ పరిస్థితికి చేరుకుంది. కలిసి వస్తే.. కలసికట్టుగా వస్తే.. విజయం తధ్యమని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి స్పష్టమైంది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 06:20 PM