Share News

Kashyap Patel: ఎవరీ కశ్యప్ పటేల్.. ట్రంప్‌కు ఎలా నమ్మకస్తుడిగా మారారు

ABN , Publish Date - Nov 07 , 2024 | 02:13 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కశ్యప్ పటేల్ ఎవరు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. కశ్యప్ పటేల్‌కు కీలకమైన సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించవచ్చంటూ కథనాలు వెలువడుతుండడంతో ఆయన గురించి ఆరా తీసేవారి సంఖ్య పెరిగింది.

Kashyap Patel: ఎవరీ కశ్యప్ పటేల్.. ట్రంప్‌కు ఎలా నమ్మకస్తుడిగా మారారు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కశ్యప్ పటేల్ ఎవరు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. కశ్యప్ పటేల్‌కు కీలకమైన సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించవచ్చంటూ కథనాలు వెలువడుతుండడంతో ఆయన గురించి ఆరా తీసేవారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా భారతీయులు ఆయనకు సంబంధించిన వివరాలను అన్వేషిస్తున్నారు.

కశ్యప్ పటేల్ గుజరాతీ కుటుంబానికి చెందినవారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. 1970 దశకంలో ఉగాండాలో ఇడి అమీన్ ప్రభుత్వం ఉన్న సమయంలో అమెరికాకు పారిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి. కశ్యప్ పటేల్1980లో గార్డెన్ సిటీ న్యూయార్క్‌లో పుట్టి పెరిగారు. హిందువుగా పెరిగారు. రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్‌లో ఇంటర్నేషనల్ లా సర్టిఫికెట్ పొందారు. అనంతరం న్యూయార్క్‌కు తిరిగి వెళ్లారు.


ప్రస్తుత రక్షణ కార్యదర్శి క్రిస్టోఫర్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కశ్యప్ పటేల్ గతంలో పనిచేశారు. అంతకంటే ముందు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఐఎస్ఐఎస్‌తో పాటు అల్-బగ్దాదీ, ఖాసిమ్ అల్-రిమీ వంటి అల్-ఖైదా నాయకులను అంతమొందించడంలో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అనేక ప్రధాన ప్రాధాన్యత కార్యకలాపాల్లోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. అనేక మంది అమెరికన్ బందీలను స్వదేశానికి తిరిగి రప్పించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.


నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్‌కు సీనియర్ న్యాయవాదిగా కూడా కశ్యప్ పటేల్ పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే ఆరోపణలపై దర్యాప్తునకు సారధ్యం కూడా వహించారు. అంతకుముందు పబ్లిక్ డిఫెండర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించి స్టేట్, ఫెడరల్ కోర్టులలో అనేక క్లిష్టమైన కేసులను విచారించారు. ‘‘ట్రంప్ కోసం ఏదైనా చేసే వ్యక్తి’’గా కశ్యప్ పటేల్‌ను అభివర్ణిస్తుంటారు. ట్రంప్ గత ప్రభుత్వం చివరి వారాల్లో పటేల్‌ను సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించాలని అనుకున్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా పదవి కట్టబెడతారనే కథనాలు పేర్కొంటున్నాయి.


ఇవి కూడా చదవండి

గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్

మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్‌ కౌంటర్

వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే

Updated Date - Nov 07 , 2024 | 02:14 PM