Share News

Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 04 , 2024 | 09:41 PM

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం జరిగింది. జెత్వానీ కేసులో సీజ్ చేసిన ఆధారాలు అన్నింటినీ భద్రపరచాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్లపై సీజ్‌ను ఎత్తివేయకుండా, మొబైల్ ఫోన్లు ఆమెకు తిరిగి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేవీఆర్ విద్యాసాగర్ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు
kadambari jethwani

అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం జరిగింది. జెత్వానీ కేసులో సీజ్ చేసిన ఆధారాలు అన్నింటినీ భద్రపరచాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్లపై సీజ్‌ను ఎత్తివేయకుండా, మొబైల్ ఫోన్లు ఆమెకు తిరిగి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేవీఆర్ విద్యాసాగర్ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్ట్ ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.


కాగా ఈ కేసు వివరాలు అందించేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ ధమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. దీంతో కేసు విచారణ ఈ నెల 11కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్ట్ ప్రకటించింది. కాగా ఈ కేసు దర్యాప్తును మరో సమర్ధవంతమైన అధికారికి అప్పగించేలా విజయవాడ సీపీని ఆదేశించాలని విద్యాసాగర్ కోరారు.


కాగా ముంబై నటిని వైసీపీ వేధించిన విషయం తెలిసిందే. పక్కా స్కెచ్‌తోనే ముంబై నటి కాదంబరి జెత్వానీని ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకొచ్చి వేధించారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత మనుషులను కాపాడుకోవడం కోసం ఓ మహిళను బలి చేశారు. ఐపీఎస్‌ అధికారులు, పోలీసులు 24 గంటల్లో కథ నడిపారు. నిబంధలనకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణం వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పదేళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్‌ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి. ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారు. ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్‌లో సాగింది. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్‌ తీసుకుని ముంబై వెళ్లారు. ఎస్‌ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు. కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా వేధించారు. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన అధికారి వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - Sep 04 , 2024 | 09:53 PM