Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా
ABN , Publish Date - Sep 19 , 2024 | 01:51 PM
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు.
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. ‘‘ న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేం: సర్ విలియం గారో’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘‘ మీరు విన్నదంతా నమ్మవద్దు. ప్రతి కథకు ఎల్లప్పుడూ మూడు కోణాలు ఉంటాయి. మీరు చెప్పేది, వాళ్లు చెప్పేది, సత్యం: రాబర్ట్ ఇవాన్స్’’ అని నాగబాబు పేర్కొన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ట్వీట్స్ చేయడంతో ఆయనను ఉద్దేశించేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లైంగిక దాడి ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ పక్కన పెట్టింది. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
నార్సింగి పోలీస్ స్టేషన్‌కు జానీ జానీ మాస్టర్ భార్య సుమలత
అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత ఇవాళ (గురువారం) నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జానీ మాస్టర్‌కు వచ్చిన ఫేక్ కాల్స్‌పై సమాచారం తెలుసుకోవడానికి ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా మీడియాపై సుమలత చిందులు తొక్కారు. ‘‘మీపై కేసులు పెడుతా’’ అంటూ మీడియాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఫేక్ కాల్స్‌పై సమాచారం తెలుసుకోవడానికి వచ్చాను’’ అని అన్నారు.
మరోవైపు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను తీసుకొని గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎస్‌వోటీ పోలీసులు ఆయనను వెంటబెట్టుకొని వస్తున్నారు. ఇదిలావుండగా జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడికి పాల్పడిందని బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఏవైనా వివరాలు అడగనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
పోలీసులకు పట్టుబడ్డ జానీ మాస్టర్.. ఎలా, ఎక్కడ దొరికాడంటే
రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు